ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో 20 మంది గాయపడ్డారు
వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోగూరు మండలం మన‍్నేగూడ వద‍్ద బుధవారం వేకువజామున కర్ణాటకకు చెందిన ప్రైవేట్ ట్రావెల్సస్ బస్సు బోల్తా పడడంతో 20 మంది గాయపడ్డారు. శ్రీసాయి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని గుల‍్బర్గాకు వెళుతుండగా మన‍్నేగూడ వద‍్ద బోల్తాపడింది.
బస్సు ప్రమాదానికి గురైనప్పుడు 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత‍్వ ఆస‍్పత్రికి తరలించారు.