ఎమ్మెల్యే కారు ఢీకొని ముగ్గురికి గాయాలు | 3 injured due to mla car accident in warangal district | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కారు ఢీకొని ముగ్గురికి గాయాలు

Published Fri, Apr 15 2016 11:31 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

ఎమ్మెల్యే కారు ఢీకొని ముగ్గురికి గాయాలు - Sakshi

ఎమ్మెల్యే కారు ఢీకొని ముగ్గురికి గాయాలు

వరంగల్: ఎమ్మెల్యే వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ నగరంలోని నాయుడు పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వాహనం బంకు సమీపానికి రాగేనే ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్నముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో శంకర్ నాయక్ కారులోనే ఉన్నారు. అయితే అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ కు బాధితుల బాధ్యతను అప్పగించి ఎమ్మెల్యే వెళ్లి పోయినట్టు స్థానికులు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement