ఆదిలాబాద్ : మహారాష్ట, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అహేరి అటవీ ప్రాంతంలో సిరోంచా వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న తెలంగాణ గ్రేహౌండ్స్, మహారాష్ట్ర సీ-60 కమేండోల బృందానికి మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
మృతి చెందిన మావోయిస్టులను ఆదిలాబాద్ డివిజన్ కమాండర్ శోభన్, మావోయిస్టులు దినేష్, ముఖేష్‌గా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47తోపాటు ఎస్‌ఎల్‌ఆర్, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోండు గిరిజన తెగకు చెందిన శోభన్ (32) తిర్యాణి మండలానికి చెందిన వ్యక్తి. ఇతడిపై 20 కేసులు పెండింగ్‌లో ఉండగా.. రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది.
ముగ్గురు మావోయిస్టుల మృతి
Published Sun, Jun 19 2016 12:58 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM
Advertisement