పోలీసుల అదుపులో ముగ్గురు మావోయిస్టులు! | 3 naxals held in police during combing operations in warangal district | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ముగ్గురు మావోయిస్టులు!

Published Fri, Sep 18 2015 9:26 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

3 naxals held in police during combing operations in warangal district

వరంగల్ : వరంగల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఘటన మరవక ముందే...మరో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఏటూరు నాగారం మండలం చిట్యాలలో మావోయిస్టులతో పాటు ఓ గ్రామస్తుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

 

నిన్న ఉదయం మహేశ్, కిష్టన్న, విమల్తో పాటు శేఖర్ అనే గ్రామస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అదుపులోకి తీసుకున్నవారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు.  మావోలకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. కాగా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ అనంతరం పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు జిల్లాలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement