ఈపూరులో రూ.30 కోట్ల భూమి కబ్జా
ఈపూరులో రూ.30 కోట్ల భూమి కబ్జా
Published Thu, Sep 1 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
నెల్లూరు(బృందావనం): ముత్తుకూరు మండటం ఈపూరులో రూ.30 కోట్లు విలువ చేసే, ప్రజలకు చెందాల్సిన ప్రైవేటు భూమిని టీడీపీ ప్రజాప్రతినిధులు కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం భూసమస్యల కన్సల్టెంట్, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ ఎస్.టిప్పు సాహెబ్, మాజీ సర్పంచ్ ఉడతా వెంకటకృష్ణయ్య, బట్టేపాటి గోపాల్, పసుపులేటి వెంకటసుబ్బయ్య, వేల్పుల ధనుంజయ, టేకుమళ్ల ఉమాశ్యాంప్రసాద్ తదితరులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ సర్వే నంబర్ 603లోని 31.25 ఎకరాల ప్రైవేట్ పట్టాభూమి 40 మంది పేరిట జాయింట్ పట్టాగా ఉందన్నారు. అధికారపార్టీ చెందిన నాయకుల ప్రలోభాలకు లోబడి అధికారులు ఆ 31.25 ఎకరాలను సంపన్నులైన 17 మందికి పట్టాదారు పాసుపుస్తకాలు అందచేశారన్నారు. ఈ విషయమై తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్‌లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేయాలని కోరారు.
Advertisement