42 వరద గేట్ల ఎత్తివేత
42 వరద గేట్ల ఎత్తివేత
Published Sun, Oct 9 2016 10:43 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
బాల్కొండ :
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు పోటెత్తడంతో ఆదివారం సాయంత్రం 42 వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల 24 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వార 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వార వెయ్యి క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వార 300 క్యూసెక్కుల, కాకతీయ కాలువ ద్వార 5 వేల క్యూసెక్కుల నీటి విడుదల అవుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90 టీఎంసీల)తో నిండుకుండలా ఉంది.
Advertisement