హన్మకొండ అర్బన్ :
జిల్లాలో ఈ ఏడాది నిరే్ధశించిన 4 కోట్ల మొక్కల లక్ష్యంలో ఇప్పటవరకు 52 శాతం పూర్తయిందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జిల్లాలో 5.76కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విద్యాసంస్థలు, ప్రజల నుంచి పండ్ల మొక్కలకు డిమాండ్ ఉన్నందున వారంలో వాటిని తెప్పించి అందజేస్తామని పేర్కొన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ విషయంలో జిల్లా కొంత వెనుకబడి ఉందని తెలిపారు. మొక్కల సంరక్షణ, నీటి సరఫరాకు సుమారు రూ.39 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. మొక్కల సంరక్షణ విషయంలో పారదర్శకతlకోసం ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేస్తున్నామని అన్నారు. సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, అటవీశాఖ అధికారులు రాజారాం, భీమానాయక్, కృష్టాగౌడ్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.