బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
Published Thu, Sep 29 2016 12:00 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM
lనెలకు రూ.5 వేల పింఛన్ ∙
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ హామీ
అమలాపురం టౌన్ : స్థానిక మున్సిపల్ కాలనీలో అత్యాచారానికి గురైన మైనర్ మానసిక వికలాంగరాలికి ఎస్సీ ఎస్టీ కమిషన్ రూ.5 లక్షలు పరిహారం, ప్రతినెలా రూ.5 వేల పింఛన్ అందజేస్తామని కమిషన్ రాష్ట్ర చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను శివాజీ బుధవారం పరామర్శించారు. బాలిక కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదుకుంటుందని, ఇంటి స్థలం, అర్హత ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కమిషన్ చొరవ తీసుకుంటుందన్నా రు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని శివాజీ పోలీసు అధికారులను ఆదేశించారు. బాలిక సంక్షేమాన్ని ఆర్డీవో గణేష్‌కుమార్‌కు చూడాలని సూచించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు.
పోలీసుల అదుపులో నిందితుడు
అమలాపురం టౌన్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు కొప్పనాతి సతీష్‌ను పట్టణ పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సతీష్ కోసం జిల్లాలో నాలుగు పోలీసు బృందాలు గాలించి చివరకు రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద ఉన్న సతీష్‌ను అదుపులోకి తీసుకుని అమలాపురానికి తరలించా రు. పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ అతడిని విచారిస్తున్నారు.
Advertisement