ప్రతి మండలంలో 6.30 లక్షల మెుక్కలు నాటాలి
-
జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్
నర్సంపేట : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలానికి 6.30లక్షల మొక్కలు నాటాలని జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం డివిజన్‌లోని అన్ని మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మండలాల్లో కొత్త గా 6.30 లక్షల మెుక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం విధించిందని చెప్పారు. ప్రభుత్వ స్థలా ల్లో ఎక్కువగా మొక్కలు నాటాలని, ఒక ఎకరంలో కనీసం వెయ్యి మొక్కలు ఉండాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది సహకారం తో గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఎంపిక చేసి మెుక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. వాటి సంరక్షణకు ఆయా గ్రామాల పరిధిలోని వ్యక్తులను నియమించాలని,వారికి ఈజీఎస్ కింద ఉపాధి కల్పించాలని సూచించారు. మొక్కల చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటుచేయాలన్నారు. అంతకు ముందు స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయం లో మెుక్కలు నాటారు. కార్యక్రమం లో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డివిజన్ పరి« దిలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.