కామాంధుడు | 60years old man Fornication relation with mother and daughter | Sakshi
Sakshi News home page

కామాంధుడు

Published Mon, Sep 4 2017 7:55 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

కామాంధుడు - Sakshi

కామాంధుడు

ఒంటరి మహిళతో వివాహేతర సంబంధం
ఆమె కుమార్తెపై అత్యాచారం
వారం క్రితం బిడ్డకు జన్మనిచ్చిన యువతి
ప్యాపిలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు  


ప్యాపిలి: మండల కేంద్రమైన ప్యాపిలిలో ఘోరం చోటు చేసుకుంది. భర్త లేని ఒంటరి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ కామాంధుడు ఆమె కూతురిపై కూడా అత్యాచారానికి ఒడిగట్టి ఆమెను తల్లిన చేసిన సంఘటన ఆలస్యంగా  ఆదివారం వెలుగు చూసింది. మండల పరిధిలోని హెచ్‌ఆర్‌ పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు 18 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. దీంతో ఆమె ప్యాపిలికి వచ్చి ఓ హోటల్‌ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది.

ఈ క్రమంలో ఆమెకు  ప్యాపిలికి చెందిన వారం సుబ్రమణ్యం (60)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచూ ఆమె ఇంటికి వచ్చే సుబ్రమణ్యం కన్ను ఆమె కుమార్తె(22)పై పడింది. తల్లి ఇంట్లో లేని సమయంలో వెళ్లి బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడేవాడు. ఏడాది కాలంగా ఇలానే ఆమెను బెదిరించి బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు.

ఈ విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరించేవాడు. కొన్నాళ్ల తర్వాత నెల తప్పిన ఆమె.. విషయాన్ని తల్లికి చెప్పేందుకు భయపడింది. ఏడో నెలలో కుమార్తె కడుపు ముందుకు రావడాన్ని గమనించిన తల్లి ఆమెను గట్టిగా నిలదీసింది. బోరుమని ఏడుస్తూ కుమార్తె జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని భావించిన తల్లి..కుమార్తెను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లింది.

అయితే ఏడో నెల కావడంతో అబార్షన్‌ చేయడం కుదరదని వైద్యులు చెప్పడంతో నిరాశతో వెనుతిరిగింది. వారం రోజుల క్రితం కుమార్తె ఆడపిల్లను జన్మనిచ్చింది. ఇప్పటికే ఆలస్యం అయిందని భావించిన తల్లి..తన కూతురుతో కలసి ఆదివారం ప్యాపిలి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారం సుబ్రమణ్యంపై  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిమ్మయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement