అనంతపురం : రవాణా శాఖ వివిధ రుసుములు, బీమా ప్రీమియాన్ని పెంచడాన్ని నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానులు చేపట్టిన సమ్మె బుధవారం ఏడోరోజుకు చేరుకుంది. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం లారీ సంఘం యజమానులతో చర్చించనుంది. మంత్రి, కమిషనర్ చర్చల్లో పాల్గొంటారని తెలిసింది. చర్చలు సఫలమైతే బంద్ విరమిస్తామని, లేదంటే ఉధృతం చేస్తామని జిల్లాలోని లారీ యజమానుల సంఘం నాయకులు చెబుతున్నారు. మరోవైపు బంద్ ప్రభావం నిత్యావసర సరుకులపై పడుతోందని సామాన్య ప్రజలు వాపోతున్నారు.