వంశధారలో నీటి ప్రవాహం నిలకడగా ఉంది.
- ఇన్‌ఫ్లో 3112 క్యూసెక్కులు
- యథాతథంగా కిందకు విడిచిపెడుతున్న బ్యారేజీ అధికారులు
హిరమండలం
వంశధారలో నీటి ప్రవాహం నిలకడగా ఉంది. 3112 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. వాటిని యథాతథంగా నీటి ప్రవాహాన్ని కిందకు వదులుతున్నారు. గత కొద్దిరోజులుగా నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఎగువ ఒడిశాలో తేలికపాటి జల్లులు పడుతుండడంతో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం 103.06 మిల్లీమీటర్లు నమోదైనట్టు వంశధార డీఈ ప్రభాకరరావు తెలిపారు. ప్రస్తుతం మూడు గేట్లు ద్వారా నీటిని విడిచిపెడుతున్నారు.