ఆప్ జిల్లా కార్యదర్శి రాజీనామా
ఆప్ జిల్లా కార్యదర్శి రాజీనామా
Published Fri, Oct 7 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడను జిల్లాగా సాధించడంలో పూర్తిగా విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ తన జిల్లా కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా కార్యదర్శి సరికొండ రుషికేశ్వర్‌రాజు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంత మంది నాయకులు తమ పదువులను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్, వెంకన్న, మహేష్, రవి, వాల్య, బాలకృష్ణ, చిన్న, నిరంజన్, కార్తిక్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement