డీటీసీ ఆస్తులపై ఏసీబీ దాడులు | acb raids in dtc a mohan rao house in kakinada | Sakshi
Sakshi News home page

డీటీసీ ఆస్తులపై ఏసీబీ దాడులు

Published Thu, Apr 28 2016 2:15 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

acb raids in dtc a mohan rao house in kakinada

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ కమిషనర్ ఎ.మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాకినాడ నగరంలోని గైగోలపాడులోని ఆయన నివాసంతోపాటు తొమ్మిదిచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాజమండ్రిలో రూ.2.50 కోట్ల ఆస్తులున్నట్లు తేల్చారు. అలాగే హైదరాబాద్, అనంతపురం, ప్రొద్దుటూరు, బళ్లారి, కడప, నెల్లూరుల్లో గురువారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ కొంపల్లిలో 8 ప్లాట్లు, మాదాపూర్‌లో నాలుగు ప్లాట్లు, జూబ్లీహిల్స్‌లో ఒక అపార్టుమెంట్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విజయవాడలో రెండు ఇళ్ల ప్లాట్లు, చిత్తూరులో 9 ఎకరాల భూమి, ప్రకాశం జిల్లాలో 45 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు గుర్తించి... స్వాధీనం చేసుకున్నారు.

ఇవిగాక చిత్తూరు, నెల్లూరుల్లో ఇంకా భూములున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వీటితోపాటు భారీగా బంగారు, వెండి సామగ్రిని కూడా ఈ తనిఖీల్లో గుర్తించారు. కీలక దస్తావేజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు సోదాలు కొనసాగుతాయని ఏసీబీ డీఎస్పీ రమాదేవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement