చీటింగ్ కేసులో నిందితుల అరెస్టు
చీటింగ్ కేసులో నిందితుల అరెస్టు
Published Wed, Dec 14 2016 11:14 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
రూ.5.18 లక్షలు రికవరీ
సామర్లకోట: కొత్త నోట్లకు లక్షకు రూ.30వేలు అదనంగా పాత నోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిన వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేష¯ŒSలో పెద్దాపురం సీఐ వీరయ్యగౌడ్ విలేకర్లకు వివరాలు తెలిపారు. ఈనెల 11వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన బైరెడ్డి సోమిరెడ్డి, వనుం చిన్నా, సీరపు అప్పలరెడ్డిలను మోసం చేసి రూ. 5.18 లక్షలతో పరారైన నిందితులను బుధవారం అరెస్టు చేశారు. స్థానిక సీబీఎం హైస్కూల్ వద్ద గంగవరపు గురుపాదం ఇంటిలో ఉన్న నిందితులు చల్లా నూకారెడ్డి (విజయనగరం జిల్లా, భోగాపురం), ఈటి నాగేశ్వరరావు (పిఠాపురం), విశాఖపట్నానికి చెందిన కడియాల శ్రీనివాసరావు, కొండపలిల నూకరాజు, సామర్లకోటకు చెందిన గంగవరపు గురుపాదం, సూరిమల్ల చిన్న అప్పారావులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సోమిరెడ్డి వర్గాన్ని నమ్మించి లక్షకు రూ. 30వేలు అదనంగా పాత నోట్లు సామర్లకోటలో ఇస్తామని తీసుకొని వచ్చి నిందితులు పరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మీకాంతం కేసు నమోదు చేశారు. గురుపాదం ఇంటిలో ఉన్న వారి నుంచి రూ.రెండు వేల నోట్లు 231, రూ.100 నోట్లు 529, రూ50 నోట్లు 62ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఎస్సైలు లక్ష్మీకాంతం, జీఎస్ వల్లీ, హెచ్‌సీలు తదితరులకు డీఎస్పీ రివార్డులు ప్రకటించారని సీఐ తెలిపారు.
Advertisement