వివాహేతర సంబంధం: మహిళపై యాసిడ్ దాడి | acid attack on women in kurnool district | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: మహిళపై యాసిడ్ దాడి

Published Mon, May 16 2016 2:28 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

acid attack on women in kurnool district

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. గ్రామానికి చెందిన రాజు(25)కు స్థానిక వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో సోమవారం ఉదయం అతడు సదరు మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై యాసిడ్ పోశాడు. బాధితురాలు కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని రాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి స్వల్పంగా గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement