పదవ తరగతి పరీక్షల పేపర్లను లీక్ చేసి దొరికిపోయిన ‘నారాయణ’ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శి నరేష్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
అనంతపురం న్యూటౌన్ : పదవ తరగతి పరీక్షల పేపర్లను లీక్ చేసి దొరికిపోయిన ‘నారాయణ’ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శి నరేష్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నారాయణ విద్యా సంస్థ ఇంతగా బరితెంచినా సీఎం చూస్తూ ఊరుకోవడం దారుణమన్నారు. విలువలను దిగజారుస్తున్న విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి నారాయణలను వెంటనే మంత్రి వర్గం నుండి తొలగించాలని డిమాండు చేశారు. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ‘నారాయణ’ వంటి వారిని బహిష్కరించకపోతే మరిన్ని దారుణాలు జరిగే అవకాశముందన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోతే తామే ప్రత్యక్ష ఉద్యమాలకు సద్ధమవుతామన్నారు.