ఆసక్తిగా వ్యవసాయ అధ్యాపకుల క్రీడా పోటీలు
నేటితో ముగింపు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, శాస్త్రవేత్తలకు రాజమహేంద్రవరంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండో రోజు శనివారం పలు పోటీలు నిర్వహించారు. ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కొన్ని క్రీడలు పూర్తవగా, మరికొన్ని సెమీఫైనల్, ఫైనల్ దశకు చేరుకున్నాయి. ఆదివారంతో ఈ పోటీలు ముగుస్తాయని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ పి.జయరామిరెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయం అధికారులు విజేతలకు బహుమతులు అందజేస్తారన్నారు.
విజేతలు వీరే...
షాట్‌ఫుట్ పురుçషుల విభాగంలో డాక్టర్ జి.రఘనాథరెడ్డి (కృష్ణాజోన్), ప్రథమ స్థానం, శ్రీనివాసరాజు (గోదావరి జోన్) ద్వితీయ స్థానం, డాక్టర్ శ్రీనివాసరావు (కృష్ణాజోన్) తృతీయ స్థానం సాధించారు. బ్రిస్క్ వాకింగ్ పురుషుల విభాగంలో వి.శ్రీనివాసరావు (కృష్ణాజోన్), డాక్టర్ డి.చిన్నంనాయుడు (ఉత్తరకోస్తా జోన్), డాక్టర్ ఎస్.దయాకర్ (గోదావరి జోన్) వరుస స్థానాలు సాధించారు. మహిళల విభాగంలో డాక్టర్ వి.విశాలాక్షి, డాక్టర్ సునీత, ఎం.రాజశ్రీ విజేతలుగా నిలిచారు. షటిల్ బ్యాడ్మింటర మహిళల విభాగంలో డాక్టర్ హైమజ్యోతి, డాక్టర్ అనూష, చెస్‌లో డాక్టర్ రాజశ్రీ, డాక్టర్ పి.జమున గెలుపొందారు. టెన్నికాయిట్‌లో కామాక్షి, మాధురి ప్రథమ స్థానం, సునీత, స్పందన ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు.