విశ్వశాంతి అఖండ బ్రహ్మయజ్ఞం
Published Fri, Aug 12 2016 5:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
తంగెడ (దాచేపల్లి) : కృష్ణా నది ఒడ్డున లోక కల్యాణం కోసం,కృష్ణా పుష్కరాలు విజయవంతంగా జరగాలని కోరుతూ తంగెడ సమీపంలోని యాగశాలలో విశ్వశాంతి అఖండ బ్రహ్మ యజ్ఞం శుక్రవారం ప్రారంభమైంది. మహిమగాది గురుపీఠం ఆధ్వర్యంలో సాధు శ్రీధర్‌దాసు స్వామీజీ పర్యవేక్షణలో 12 రోజుల పాటు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఒరిస్సాకు చెందిన 12 మంది సాధువులు బ్రహ్మ యజ్ఞం (ధుని), అఖండ జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు కోగంటి శివన్నారాయణ, మందపాటి రమేష్‌రెడ్డి, బత్తుల వెంకయ్య, శానంపూడి కష్ణారెడ్డి, నెల్లూరి బ్రహ్మయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement