– హజ్ కమిటీ చైర్మన్, కర్ణాటక మంత్రి రోషన్‌బేగ్
హిందూపురం అర్బన్ : హజ్ యాత్ర చేస్తున్న యాత్రికులకు బెంగళూరులోని న్యూహజ్‌హౌస్‌లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ హజ్ కమిటీ చైర్మన్, కర్ణాటక మంత్రి ఆర్.రోషన్‌బేగ్ అన్నారు. స్థానిక కేహెచ్ ఫంక్షన్lహాల్‌లో హజ్‌కు వెళ్లే యాత్రికులకు రిటైర్డు ఎస్పీ ఇలియాజ్‌సేట్ అధ్యక్షతన శిక్షణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రోషన్‌బేగ్ మాట్లాడుతూ 45 రోజుల హజ్‌యాత్ర ఈనెల 28 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 243 మంది హజŒ æయాత్రికుల్లో హిందూపురం నుంచే 76 మంది ఉన్నారని చెప్పారు. అనంతరం హజ్ జిల్లా ఆర్గనైజర్ ఇర్షాద్ యాత్రికులకు శిక్షణ అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీ, నజీర్‌సాబ్, సిద్ధిక్‌సేuŠ, సహాయకులు మహబూబ్, నాసిర్, రషీద్, రఫీక్, అల్లాబకాష్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనసన్మానం
కర్ణాటక మంత్రి, హజ్ కమిటీ చైర్మన్ రోషన్‌బేగ్‌ను మంగళవారం స్థానిక సడ్లపల్లి లారీ యూనియన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఇందాద్, డీసీసీ కార్యదర్శి అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు రవూఫ్, నాయకులు జమీల్, జబీ, రెహెమత్, రఫీక్, ఫయాజ్, తన్వీర్, కలీం తదితరులు పాల్గొన్నారు.
అన్ని సదుపాయాలతో న్యూహజ్‌హౌస్
Published Tue, Aug 16 2016 10:11 PM | Last Updated on Tue, Oct 30 2018 5:50 PM
Advertisement