అనంతపురం సప్తగిరిసర్కిల్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న అండర్–16 గ్రూప్–బీ అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు పరుగు తేడాతో అవుట్ రేట్ విజయం నమోదు చేసింది. మూడు రోజుల మ్యాచ్‌లో అనంత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 211 పరుగులు చేయగా ప్రకాశం జట్టు 209 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అనంత జట్టు ఓవర్‌నైట్ స్కోరును 70–4 తో ప్రారంభించి చివరి రోజు 181 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ యోగానంద 59, అర్జున్ టెండూల్కర్ 51 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.
అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రకాశం జట్టులో లేఖజ్‌రెడ్డి సెంచరీతో అలరించాడు. కాగా చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు చేయాల్సి ఉండగా లేఖజ్‌రెడ్డి 2 సిక్సర్లు, ఫోర్ బాదాడు. దీంతో చివరి ఓవర్‌లో 2 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే కామిల్ అద్భుత బౌలింగ్‌తో మూడు వికెట్లు సాధించి అనంత జట్టుకు విజయం అందించాడు. జిల్లా క్రికెట్ జట్టు విజయం సాధించడంపై జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, కేఎస్ షాబుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు.
పరుగు తేడాతో ‘అనంత’ విజయం
Published Sat, Aug 5 2017 9:46 PM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement
Advertisement