![దేశంలోనే ఏపీలో రైతు ఆత్మహత్యలెక్కువ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71450475484_625x300.jpg.webp?itok=EXkLxxdm)
దేశంలోనే ఏపీలో రైతు ఆత్మహత్యలెక్కువ
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ అన్నారు. వ్యవసాయ సంక్షోభం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో ఇప్పటి వరకు 300 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆయన కర్నూలు పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ తరపున నష్టపరిహారం అందజేశారు. ఆత్మహత్య చేసుకున్న 20 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు సమగ్ర విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్ పాల్గొన్నారు.