ఎడ్యుకేషన్‌హబ్‌గా ఆంధ్రప్రదేశ్
– రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ
కర్నూలు(టౌన్): ఎడ్యుకేషన్ హాబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ అన్నారు. సోమవారం నగర శివారులోని మారం కన్వెన్షనల్ ఫంక‌్షన్ హాలులో కెరీర్ ఫౌండేషన్ కోర్సుపై విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో నంబర్‌వన్ స్థానంలో మున్సిపల్ పాఠశాలలను నిలబెడతామన్నారు. అందుకుకావాల్సిన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రభుత్వ పాఠశా‍్ల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు
ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సును ప్రవేశ పెడతామని మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. సోమవారం సునయన ఆడిటోరియంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం 57 మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సును 36 వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారన్నారు. తాను పేదరికం నుంచి వచ్చిన వాడినేనని అందుకోసం ఎక్కువ మంది పేద విద్యార్థుల బాగు కోసం ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. కాగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ముందు మౌలిక వసతులు కల్పించాలని ఆ తరువాతే ఐఐటీ ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించాలని సూచించారు.