ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-కలకత్తా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఖరగ్‌పూర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ ఐ)-కోల్‌కతా.. ఈ మూడు ప్రఖ్యాత సంస్థలు కలిసి సంయుక్తంగా బిజినెస్ అనలిటిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్(పీజీ) ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేయనున్నాయి. రెండేళ్ల కాలవ్యవధి ఉండే ఈ కోర్సు వచ్చే ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. తాజా ప్రతిపాదనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. కొత్త కోర్సుకు ఇంకా పేరును ఖరారు చేయలేదు. మూడు సంస్థలు కలిసి కరిక్యులమ్‌ను రూపొందిస్తాయి. కోర్స్ కంటెంట్‌లో మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, టెక్నాల జీ కాంబినేషన్ సబ్జెక్ట్‌లు ఉంటాయి.
కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు మూడు సంస్థలు సంయుక్తంగా డిగ్రీని ప్రదానం చేస్తాయి. తాజా ప్రోగ్రామ్ ద్వారా వ్యాపార నిర్వహణకు అవసరమైన అన్ని నైపుణ్యాలను నేర్చుకోవచ్చని ఐఐఎం-కలకత్తా వర్గాలు తెలిపాయి. ఈ పోస్టుగ్రాడ్యుయేట్ (పీజీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రత్యేకమైన అడ్మిషన్ విధానం, ఎంట్రెన్స్ ఉంటుంది. అభ్యర్థుల గణాంక నైపుణ్యాలను పరీక్షించేలా ఈ పరీక్షను రూపొందిస్తారు. రెండేళ్ల కోర్సును నాలుగు సెమిస్టర్లుగా విభజించారు. విద్యార్థులు మొదటి మూడు సెమిస్టర్లలో.. ఒక్కో సంస్థలో ఒక్కో సెమిస్టర్‌ను అభ్యసిం చాలి. మూడు సంస్థలు కోర్స్ కరిక్యులమ్‌లో తమ వంతు భాగాన్ని బోధిస్తాయి. నాలుగో సెమిస్టర్‌ను పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఐఐఎం-అహ్మదాబాద్‌లోజాయ్ ఆఫ్ గివింగ్ వీక్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-అహ్మదాబాద్‌లో ప్రతిఏటా నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ‘జాయ్ ఆఫ్ గివింగ్ వీక్’ అక్టోబర్ 6 నుంచి 12 వరకు జరగనుంది. ఇందులో విష్ ట్రీ, క్లాథ్స్ కలెక్షన్ డ్రైవ్, ఏ డే ఎట్ ఐఐఎంఏ వంటి కార్యక్రమా లుంటాయి. ఇతర ప్రాంతాల విద్యార్థులు ఇందులో పాల్గొనొచ్చు. ఒక రోజంతా క్యాంపస్ లోనే గడపొచ్చు. ఐఐఎంఏ విద్యార్థులు, ప్రొఫె సర్లతో భేటీ కావొచ్చు. క్విజ్‌లు, క్లబ్ ఇంటరాక్ష న్స్ వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అ య్యేందుకు అవకాశం ఉంది. జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఇప్పటినుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.
మూడు సంస్థల సంయుక్త పీజీ ప్రోగ్రామ్
Published Sun, Sep 28 2014 12:04 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement