గవర్నర్ను కలిసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ | ap assembly speaker kodela siva prasada rao meets governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్ను కలిసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్

Published Mon, Dec 7 2015 12:03 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

ap assembly speaker kodela siva prasada rao meets governor narasimhan

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సోమవారం రాజ్భవన్లో కలిశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపాలిటీ శత జయంతి ఉత్సవాలకు గవర్నర్ను ఈ సందర్భంగా కోడెల ఆహ్వనించారు.   అనంతరం కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు నరసరావుపేట మున్సిపాలిటీ శతాబ్ధి ఉత్సవాలు జరుపుతున్నట్లు చెప్పారు.

 

ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, గవర్నర్ నరసింహన్ హాజరవుతారన్నారు. రూ.200 కోట్లతో నరసరావుపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మాణంతో పాటు, అయిదు శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. స్పీకర్గా ఉన్న అన్ని అవకాశాలు వినియోగిస్తున్నామని, ఓట్ల కోసం, రాజకీయాల కోసం చేయటం లేదని కోడెల తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement