కృష్ణా పుష్కరాలకు అప్పన్న ఉద్యోగులు | Appanna employees work in puskaralu | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు అప్పన్న ఉద్యోగులు

Published Wed, Aug 3 2016 6:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

Appanna employees work in puskaralu

సింహాచలం : కృష్ణా పుష్కరాలలో విధులు నిర్వర్తించేందుకు సింహాచలం దేవస్థానానికి చెందిన 42 మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై నియమిస్తూ దేవాదాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానం ఈఈ కె.వి.ఎస్‌.ఆర్‌. కోటేశ్వరరావు, ఏఈవోలు అనంత లక్ష్మీసత్యవతీదేవి, దుర్గారావు, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ కుటుంబరావు, సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్, టెక్నికల్‌ మేస్త్రి అప్పారావుతో పాటు ఎనిమిది మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 14 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ఏడుగురు రికార్డు అసిస్టెంట్లు, ఏడుగురు అటెండర్లను నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement