డీలరు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Published Wed, Aug 3 2016 11:54 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
టెక్కలి: డివిజన్‌లో ఖాళీగా ఉన్న ఆరు డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇచ్ఛాపురం అర్బన్‌డిపో (ఓసీ మహిళ), సోంపేట మండలం చేపల గొల్లగండి (ఓసీ జనరల్), బారువా డిపో నంబర్ 20(బీసీ జనరల్), డిపో 22 (బీసీ జనరల్), పలాస మండలం రెంటికోట–2 డిపో(బీసీ ఎ), జలుమూరు మండలం నగిరికటకం (ఎస్సీ)లో ఖాళీల భర్తీకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఈ నెల 10 లోగా తమ కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. ఆగస్టు 16న రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
Advertisement
Advertisement