బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Published Thu, Mar 30 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
కర్నూలు(అర్బన్): జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్ పోస్టులకు అర్హులైనవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు భాస్కర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఎస్సీ పరిధిలో 16, డీఎస్సీ పరిధిలో లేనివి 41 బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను www.kurnool.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు. పూర్తి వివరాలను తెలుసుకున్న అనంతరం Mozilla Firefox/Internet Explorer ద్వారా url address : srdaddwknl.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08518–277864 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement