ప్రభుత్వోద్యోగులు తమ పదవీ కాలంలో బదిలీ / పదోన్నతికి అర్హత సాధించేందుకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు రాసేందుకు సదవకాశం లభించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు కలిపి 155 రకాల పేపర్ కోడ్‌లతో పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 24వ తేదీలోపు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
- అనంతపురం
ఎవరు రాయాలి :
అప్రయత్న పదోన్నతి పథకం (ఏఏఎస్)లో భాగంగా ఎస్‌జీటీ లేదా ఎస్‌జీటీ సమాన క్యాడర్‌లో ఉన్న వారు, 12 ఏళ్ల స్కేలు పొందేందుకు ఎలాంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. కానీ 24 ఏళ్ల స్కేల్ పొందడానికి జీవో, ఈవో పరీక్షలు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. ‘స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరీ ఉపాధ్యాయులు 12 ఏళ్ల స్కేల్ పొందేందుకు డిగ్రీ, బీఈడీ విద్యార్హతలతో పాటు జీవో (గెజిటెడ్ ఆఫీసర్), ఈవో (కార్యనిర్వహణాధికారి) టెస్ట్ రెండింటిలోనూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ‘స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందేందుకు జీఓ, ఈఓ పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. ‘సర్వీస్‌లో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోని వారు 45 ఏళ్ల వయసు దాటితే పదోన్నతి పొందేందుకు ఎలాంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
ఉత్తీర్ణత మార్కులు ఇలా :
డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పరీక్షలోనూ 40 శాతం మార్కులు సాధించాలి. అయితే జీవో టెస్ట్‌లో రెండు పేపర్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి పరీక్షలోనూ 40 శాతం మార్కులు సాధించాలి.
సిలబస్ :
జీవో పరీక్షకు పేపర్–1 (కోడ్88) సిలబస్ : ఇన్‌స్పెక‌్షన్స్ కోడ్స్ ది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్స్, ఎలిమెంటరీ స్కూల్ రూల్స్, పీఎఫ్ రూల్స్ ఫర్ నాన్ పెన్షనబుల్ సర్వీసులతో పాటు వర్తమాన అంశాలు ప్రిపేర్ అవ్వాలి. ఏపీ పాఠశాల విద్య, సర్వీస్ నిబంధనలు, ఏపీ సీసీఏ రూల్స్, ఏపీ మండల ప్రజా పరిషత్ చట్టం, ఏపీ ఓఎస్‌ఎస్‌తో పాట వర్తమాన అంశాలు ఉంటాయి. ఈవో పరీక్ష (కోడ్141) సిలబస్‌లో భాగంగా ఏపీ బడ్జెట్ మాన్యువల్, ఏపీ ఖజానా శాఖ కోడ్, ఏపీ పింఛన్ కోడ్, భారత రాజ్యాంగ నిర్మాణం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్), పీఆర్‌సీకి సంబంధించిన అంశాలను ప్రిపేర్ అవ్వాలి.
ఫీజు వివరాలు :
ప్రతి పేపర్‌కు రూ.200 వంతున ఫీజు చెల్లించాలి. జీవో టెస్ట్‌కు రెండు పేపర్లకు రూ.400 ఈవో టెస్ట్‌కు రూ.200 చొప్పున మొత్తం రూ.600 చెల్లించాలి. అలాగే ప్రతి పరీక్షకూ రూ.500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
పరీక్ష తేదీలు :
జీవో (కోడ్ 88, 97) పేపర్–1 జూన్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, పేపర్–2 అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకూ ఉంటుంది. ఈవో (కోడ్141) జూన్ 11 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది.
డిపార్ట్‌మెంటల్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
Published Fri, May 19 2017 12:09 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM
Advertisement
Advertisement