రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి
Published Wed, Jul 27 2016 4:32 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
పుట్లూరు :
ఎంఎస్‌ఎంఈ పథకం కింద కాపులు గ్రూపు రుణాల కోసం ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ నెహమ్యా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు చెందిన వారు అర్హులన్నారు. ఒక గ్రూపులో 3 నుంచి 5 మంది అభ్యర్థులు ఉండాలని, ఆదాయం 6లక్షలకు మించకూడదని తెలిపారు.
గ్రూపులోని అభ్యర్థులు 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. గతంలో ఏ బ్యాంకులో డిఫాల్టర్‌గా ఉండకూడదని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ పథకం కింద యూనిట్ విలువ రూ.25లక్షలు కాగా అందులో కాపు కార్పోరేషన్ కింద 40శాతం సబ్సీడీ రూ.10లక్షలు, బ్యాంకు లోను 40శాతం రూ.10లక్షలు, గ్రూపు లబ్ధిదారుల వాటా 20శాతం రూ.5లక్షలుగా ఉంటుందన్నారు.
రుణాల కోసం ఆన్‌లైన్‌లోని www.kapucorp.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Advertisement
Advertisement