మంచితనానికి మారుపేర్లు వీళ్లు...
తాడేపల్లి రూరల్: భక్తులు పోగొట్టుకున్న బంగారు వస్తువులను వెతికి అప్పగిస్తూ గజ ఈతగాళ్ళు శభాష్ అనిపించుకుంటున్నారు. సీతానగరం ఘాట్‌లో ఉంగరం పోయినా నిమిషాల వ్యవధిలోనే వెతికి చేతికి అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ మహిళ పోగొట్టుకున్న మంగళసూత్రాలు అప్పగించిన గజ ఈతగాళ్ళు సోమవారం ఒక బాలిక పోగొట్టుకున్న ఉంగరాన్ని నీళ్లల్లో నుంచి వెతికి తీసి ఇచ్చారు.