Appreciations
-
కేజ్రివాల్ కంటే ఆతిశి నయం
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటే ఢిల్లీ ప్రస్తుత సీఎం ఆతిశి వెయ్యి రెట్లు నయమని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారం ప్రశంసలు కురిపించారు. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఆయన ఆతిశితో కలిసి పాల్గొన్నారు. వేదికపై నున్న ఆతిశిని ఉద్దేశిస్తూ.. ‘ఢిల్లీ సీఎంగా మహిళ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. పూర్వ సీఎం కంటే ఆమె వెయ్యిరెట్లు నయమని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను’ అని సక్సేనా వ్యాఖ్యానించారు. సాధారణంగా ఢిల్లీ ఎల్జీకి, ఆప్ ప్రభుత్వానికి పొసగదు. ఎప్పుడూ ఉప్పునిప్పుగా ఉండే సక్సేనా.. ఆతిశిపై ప్రశంసలు కురిపించడం విశేషం. జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చాక అరవింద్ కేజ్రివాల్ ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన నిజాయితీకి ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చాకే (ఎన్నికల్లో నెగ్గి) మళ్లీ సీఎం పదవిని చేపడతానని కేజ్రివాల్ అన్నారు. కేజ్రివాల్ బదులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆతిశి జెండా ఎగురవేస్తారని ఆప్ సర్కారు ప్రతిపాదించగా.. సక్సేనా నిరాకరించిన విషయం తెలిసిందే. -
గెహ్లాట్‌పై మోదీ ప్రశంసలు.. తేలిగ్గా చూడొద్దన్న సచిన్ పైలట్
జైపూర్: రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్‌పై దాడికి దిగారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమంలో గెహ్లాట్‌పై ప్రశంసలు కురిపించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. పైలట్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో మోదీ పార్లమెంటులో గులాం నబీ ఆజాద్‌ను ప్రశంసించారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. తాజాగా గెహ్లాట్‌ను ప్రశంసించారు’’ అంటూ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడటాన్ని ఉద్దేశించి అన్యాపదేశంగా గెహ్లాట్ కూడా అదే చేస్తారనే అర్థంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయన్నారు. ఆ ఎమ్మెల్యేలపై చర్యలేవీ ? గెహ్లాట్‌తో పాటుగా ఆయన వర్గం ఎమ్మెల్యేల విషయంలో కూడా పైలెట్ అధిష్టానాన్ని నిలదీశారు. సెప్టెంబర్‌లో జరిగిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరై గెహ్లాట్ మద్దతుగా బలప్రదర్శనకు వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువుందని, క్రమ శిక్షణ తప్పిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పార్టీకి కొత్తగా అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖర్గేకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెహ్లాట్ పోటీలోకి దిగుతారని ప్రచారం జరిగినప్పుడు, సచిన్ పైలెట్‌ను తదుపరి సీఎంను చేస్తారని వార్తలొచ్చాయి. దీంతో గెహ్లాట్‌కు మద్దతుగా ఆయన వర్గం ఎమ్మెల్యేలు బలప్రదర్శనకు దిగిన విషయం తెలిసిందే. సీఎల్పీ సమావేశానికి గైరా>్హజరైన గెహ్లాట్‌కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారందరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పైలెట్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు మళ్లీ గళం విప్పారు? సచిన్ పైలట్ ఉన్నట్టుండి గెహ్లాట్నిలెందుకు టార్గెట్ చేశారంటూ చర్చ జరుగుతోంది. రెండు నెలలుగా రాజస్తాన్ రాజకీయాల్లో ఒక విధమైన స్తబ్దత నెలకొంది. నాయకులెవరూ పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదన్న అధిష్టానం ఆదేశంతో గెహ్లాట్, పైలట్ వర్గీయులు మౌనం పాటిస్తున్నారు. కానీ ఇటీవల పైలట్‌పై గెహ్లాట్ పరోక్ష విసుర్లకు దిగారు. అధికారంలో కొనసాగడానికి అనుభవానికి మించినది మరేది లేదని, తమ వంతు వచ్చే వరకు సహనంతో వేచి చూడాలని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం అభ్యర్థిని తానేనంటూ అన్నింట్లోనూ తన ఫోటో బాగా కనిపించేలా చర్యలు చేపడుతున్నారు. రోడ్డు బ్యానర్లు, పత్రికల్లో ప్రకటనలు, బడ్జెట్‌కు సంబంధించిన ప్రతులు, బిల్లు బోర్డులపై గెహ్లాట్ చిత్రాలే దర్శనమిస్తున్నాయి. అటు హైకమాండ్ కూడా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బిజీగా ఉండడం, రాహుల్ జోడో యాత్రలో ఉండడంతో రాజస్థాన్ వ్యవహారాలను పట్టించుకునే తీరిక వారికి లేదు. ఈ నేపథ్యంలో గెహ్లాట్‌ను ప్రధాని మోదీ ఓ మాటనగానే సచిన్ తన రాజకీయ అస్త్రాలకు పదును పెట్టారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
మసీదులో ఏమైనా జరుగుతోందా? అమిత్ షా చర్యతో అంతా చప్పట్లు
బారాముల్లా(జమ్ము కశ్మీర్): కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన చేష్టలతో కశ్మీరీల జేజేలు అందుకున్నారు. బుధవారం సాయంత్రం ఉత్తర కశ్మీర్ బారాముల్లాలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అయితే.. కాసేపటికే ఆయనకు ఏదో శబ్దం వినిపించింది. మసీదులో ఏమైనా జరుగుతుందా? అని ఆయన పక్కనున్న నేతలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలోని మసీదు నుంచి అజాన్ అని వాళ్లు చెప్పగానే.. ఆయన తన ప్రసంగాన్ని ఆపేశారు. కాసేపటి తర్వాత అయిపోయిందా? అజాన్ అయిపోయింది ఇప్పుడు నేను ప్రసగించొచ్చా..? అంటూ అక్కడున్నవాళ్లను ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా చప్పట్లు, ఈలలతో ఆయన్ని అభినందించారు. Halting the Speech Midway by Hnbl Home Minister due to #Azaan is Great Gesture and has Won the Hearts of Kashmiris, this Clearly Indicates the Respect for the Religion and Sentiments of Kashmiris. @AmitShah @AshokKoul59 #NayaKashmir pic.twitter.com/853g8IXXgq — Sheikh Iqbal (@ListenIqbal) October 5, 2022 అంతకు ముందు ర్యాలీలో ప్రసంగించే ముందు అమిత్ షా బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌ను తొలగించారు. తాను ప్రజలతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను అంటూ ప్రసంగించడం గమనార్హం. ఇక ర్యాలీ తర్వాత వురికి వెళ్లిన ఆయన.. అక్కడ మే నెలల జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పోలీస్ అధికారి ముదాసిర్ షేక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన సమాధికి నివాళులర్పించారు. కేంద్రం నుంచి ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మాటిచ్చారాయన. VIDEO: Just before addressing the gathering in #Baramulla, J&K today, Home Minister @AmitShah ji had his bullet proof glass removed. pic.twitter.com/gSMM4uMtMi — Dr Jitendra Singh (@DrJitendraSingh) October 5, 2022 ఇదిలా ఉంటే.. హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన బుధవారంతో ముగిసింది. కశ్మీర్ భద్రతకు సంబంధించి ఉన్నతాధికారులతోనూ సమావేశం అయ్యారు ఆయన. ఇక ఈ పర్యటనలోనే ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే పాక్‌తో ఎట్టిపరిస్థితుల్లో చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. -
వరంగల్ పోలీసులపై డీజీపీ ప్రశంసలు
వరంగల్ క్రైం : ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేసే నేరాల సంఖ్య పెరుగుతోంది. సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీని అపరిచిత వ్యక్తులకు చెబితే క్షణాల్లో బ్యాంకులో ఉన్న సొమ్ము స్వాహా అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిందితులు దేశ, విదేశాల్లో ఉండి తమ నేరాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. యువతులు, మహిళలను వేధించడం, సామాజిక మాధ్యమాల ద్వారా ఇబ్బంది పెట్టే ఆకతాయిల ఆట కట్టించడం తదితర కేసుల్లో సాంకేతిక అంశాలను సేకరించడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన సైబర్ క్రైం విభాగం పోలీసులు చాటుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పోలీస్ బాస్ మహేందర్‌రెడ్డి వరంగల్ సిబ్బందిపై శభాష్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో వరంగల్ సైబర్ క్రైం పోలీసుల ప్రతిభ రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. సైబర్ వారియర్స్‌తో శిక్షణ రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల కాలంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా డీజీపీ కార్యాలయం నుంచి ‘సైబర్ వారియర్స్’ పేరిట రాష్ట్రంలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ట్యాబ్‌లు అందజేసి పిటీ కేసులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు డయల్ 100 కు వచ్చే ఫోన్లకు 5 నుంచి 10 నిమిషాలలో స్పందించేలా చూస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. అధునాతన పరికరాలు, అత్యాధునిక విభాగం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ విభాగంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ఉన్నాయి. 2018 మార్చి 18న ఈ విభాగం ప్రారంభమైంది. పోలీస్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడిచే ఈ విభాగంలో ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక అసిస్టెంట్ ఎనలైటికల్ అధికారితో పాటు తొమ్మిది మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. వీరందరూ బీటెక్విద్యార్హతతో కలిగి ఉన్న నేపథ్యంలో సాంకేతిక పరమైన అంశాలపై మంచి పట్టు ఉండి అనేక కేసుల్లో కీలక సమాచారాన్ని అందించగలుగుతున్నారు. ఓటీపీ, బ్యాంకు, వాట్సప్, ఫేస్బుక్, లాటరీ, ఉద్యోగాలు, గిప్ట్‌లు పేరిట జరుగుతున్న మోసాలు, యువతులు, మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తదితర అంశాల్లో విచారణ సిబ్బందికి కీలక సమాచారం అందిస్తూ నేరస్తుల ఆట కట్టిస్తున్నారు. ఇదే సమయంలో వరంగల్ సైబర్ పోలీస్ విభాగం ఆధ్వర్యాన ప్రజలను చైతన్యపరిచేలా వీడియో సందేశాలను వాట్సప్ ద్వారా పంపిస్తున్నారు. వీఓఐటీ ఇంటర్నెట్ కాల్స్‌ను చేధించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బాలుడు కుసుమ దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో వరంగల్ సైబర్ క్రైం పోలీసులు అందించిన సాంకేతిక సమాచారంతోనే నిందితుడిని గుర్తించగలిగారు. బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగుడు ఆయన తల్లిదండ్రులకు ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేస్తుండడంతో గుర్తించడం సాధ్యం కాలేదు. ఈ మేరకు రంగంలోకి దిగిన సైబర్ బృందం వీఓఐటీ ఇంటర్నెట్ కాల్స్‌ను చేధించి నిందితుడిని అరెస్ట్ చేయించగలిగారు. ఈ విషయంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ పోలీసులకు సైతం దొరకని సమాచారాన్ని వరంగల్ సైబర్ పోలీసులు అందించడం విశేషం. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది మంది హత్యల కేసులో సాంకేతిక సమాచారమే కీలకంగా మారింది. ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. నిందితుడు చేసిన ఫోన్ల ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు ఆయనను గుర్తించారు. అనంతరం కోర్టులో కూడా సాంకేతిక ఆధారాలను సమర్పించడంతో నిందితుడికి ఉరిశిక్ష ఖరారైంది. ఆన్లైన్ రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకుంటే... వారి ఫోన్లలో నంబర్లు సేవ్ అయి ఉన్న వ్యక్తులకు చెడుగా సమాచారం ఇస్తూ ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను గుర్తించడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం అధికారులు పాత్ర కీలకంగా మారింది. బెంగళూరు కేంద్రంగా రుణాలు ఇస్తూ, వేధిస్తున్న నలుగురు నిందితుల అరెస్టులో వరంగల్ సైబర్ పోలీసులు కీలకపాత్ర పోసించారు. చదవండి : (ఈ-కామర్స్‌లో తెలుగుతో తెలివిగా టోకరా..) (రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం ) -
మంచితనానికి మారుపేర్లు వీళ్లు...
తాడేపల్లి రూరల్: భక్తులు పోగొట్టుకున్న బంగారు వస్తువులను వెతికి అప్పగిస్తూ గజ ఈతగాళ్ళు శభాష్ అనిపించుకుంటున్నారు. సీతానగరం ఘాట్‌లో ఉంగరం పోయినా నిమిషాల వ్యవధిలోనే వెతికి చేతికి అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ మహిళ పోగొట్టుకున్న మంగళసూత్రాలు అప్పగించిన గజ ఈతగాళ్ళు సోమవారం ఒక బాలిక పోగొట్టుకున్న ఉంగరాన్ని నీళ్లల్లో నుంచి వెతికి తీసి ఇచ్చారు. -
కృష్ణమ్మ ఆశీర్వచనం
కృష్ణలో స్నానమాచరిస్తే సకల సౌభాగ్యాలూ దక్కుతాయని భక్తుల నమ్మకం.. ఆ తలంపుతో సత్తెనపల్లికి చెందిన చిత్రకారుడు జింకా రామారావు కృష్ణమ్మ ఆశీర్వదిస్తున్నట్లుగా చిత్రం గీసి మంత్రముగ్ధుల్ని చేశారు. పలువురి ప్రశంసలు పొందుతున్నారు. – సత్తెనపల్లి -
సూపర్‌స్టార్ ప్రశంసించారు
ప్రశంసలు పరవశింపజేస్తాయి. అందులోనూ రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్ అభినందించారంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పనలవికాదు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ అలాంటి సంతోషసాగరంలో మునిగి తేలుతున్నారు. నటిగా ఈమె వయసు చాలా తక్కువే. అందువల్ల వరలక్ష్మి నటిగా ఎక్కువ ప్రశంసలు అందుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే విశాల్‌తో ప్రేమ వంటి వదంతులనే తను ఎదుర్కొంటున్నారు. అలాంటిది తొలి సారిగా తన నటనకు గానూ ప్రశంసల వర్షం కురుస్తుంటే వాటికి ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరలక్ష్మి కథానాయకిగా నటించిన తారైతప్పట్టై చిత్రం ఇటీవల విడుదలైంది. శశికుమార్ కథానాయకుడిగా నటించి నిర్మించిన ఈ చిత్రానికి బాలా దర్శకుడు. చిత్రంపై మిశ్రమ స్పందన వస్తున్నా ఇందులో గరగాట కళాకారిణిగా నటించిన నటి వరలక్ష్మి నటనను మాత్రం విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా వరలక్ష్మి నటనను అభింనందించడంతో ఆమె ఆనందభరితం అయిపోతున్నారు. దీని గురించి వరలక్ష్మి తెలుపుతూ తారైతప్పట్టై చిత్రంలో తన నటనను, నృత్యాన్ని పలువురు చిత్ర ప్రముఖులూ, అభిమానులూ ప్రశంసించడం ఒక ఎత్తు అయితే రజనీకాంత్ ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించడం మధురానుభూతికి లోనైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు.