సూపర్‌స్టార్ ప్రశంసించారు | Rajinikanth appreciated Varalaxmi Sarathkumar!! | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్ ప్రశంసించారు

Published Wed, Jan 27 2016 3:28 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

సూపర్‌స్టార్ ప్రశంసించారు - Sakshi

సూపర్‌స్టార్ ప్రశంసించారు

ప్రశంసలు పరవశింపజేస్తాయి. అందులోనూ రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్ అభినందించారంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పనలవికాదు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ అలాంటి సంతోషసాగరంలో మునిగి తేలుతున్నారు. నటిగా ఈమె వయసు చాలా తక్కువే. అందువల్ల వరలక్ష్మి నటిగా ఎక్కువ ప్రశంసలు అందుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే విశాల్‌తో ప్రేమ వంటి వదంతులనే తను ఎదుర్కొంటున్నారు. అలాంటిది తొలి సారిగా తన నటనకు గానూ ప్రశంసల వర్షం కురుస్తుంటే వాటికి ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరలక్ష్మి కథానాయకిగా నటించిన తారైతప్పట్టై చిత్రం ఇటీవల విడుదలైంది.

శశికుమార్ కథానాయకుడిగా నటించి నిర్మించిన ఈ చిత్రానికి బాలా దర్శకుడు. చిత్రంపై మిశ్రమ స్పందన వస్తున్నా ఇందులో గరగాట కళాకారిణిగా నటించిన నటి వరలక్ష్మి నటనను మాత్రం విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా వరలక్ష్మి నటనను అభింనందించడంతో ఆమె ఆనందభరితం అయిపోతున్నారు.

దీని గురించి వరలక్ష్మి తెలుపుతూ తారైతప్పట్టై చిత్రంలో తన నటనను, నృత్యాన్ని పలువురు చిత్ర ప్రముఖులూ, అభిమానులూ ప్రశంసించడం ఒక ఎత్తు అయితే రజనీకాంత్ ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించడం మధురానుభూతికి లోనైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement