ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఆరే రాజన్నను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆదిలాబాద్ అగ్రికల్చర్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఆరే రాజన్నను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. గత రెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి ఎట్టకేలకు ప్రభుత్వం కార్యవర్గాన్ని ప్రకటించింది.
కొద్దిరోజుల్లో పత్తి మార్కెట్ ప్రారంభం కానుండడంతో రైతులను ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా అప్కాం గంగయ్య, సభ్యులుగా ముసుకు గోవర్ధన్ రెడ్డి, కుమ్ర జంగు, షేక్‌షరీఫ్ కీమా సదానందం, పెగ్గర్ల సుదర్శన్, కట్కం పుష్పలత, జవాజీ ప్రకాశ్, మారే గోవర్ధన్‌రెడ్డి ఉంటారు. వీరితోపాటు తాంసి కోఆపరేటీవ్ సొసైటీ చైర్మన్, ఏడీఏ, ఏడీఎం, మున్సిపల్ చైర్‌పర్సన్లు మిగతా సభ్యులుగా ఉంటారని జీవోలో పేర్కొంది. నూతన కమిటీ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.