ఆర్మీ ర్యాలీకి 2946 మంది హాజరు
బోట్‌క్లబ్ (కాకినాడ) :
జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఆర్మీ ర్యాలీలో అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 8వ రోజు బుధవారం ఆరు జిల్లాల నుంచి 2946 మంది హాజరయ్యారు. ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థులకు సరైన వసతులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సోల్జర్ టెక్నికల్ పోస్టులకు 4013 మందికి అడ్మిట్ కార్డులు జారీ చేయగా 2946 మంది హాజరయ్యారని, 378 మంది ఎత్తు చాలక తొలగింపునకు గురయ్యారని సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 2568 మందిలో 198 మంది పరుగు పరీక్షలో పాస్‌కాగా, వీరిలో 180 మంది వైద్య పరీక్షలకు ఎంపికయ్యారన్నారు. గురువారం సోల్జర్ క్లర్కు పోస్టులకు పోటీలు నిర్వహిస్తామన్నారు.