ప్రైవేటు ఉచ్చులో సంచార వైద్యం | arogya sree 104 gos to private piramil and smri | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఉచ్చులో సంచార వైద్యం

Published Thu, Mar 17 2016 4:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

ప్రైవేటు ఉచ్చులో సంచార వైద్యం

ప్రైవేటు ఉచ్చులో సంచార వైద్యం

ప్రైవేటీకరణ బాటలో 104 వైద్యసేవలు
పిరమిల్ ఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు బాధ్యతలు
సిబ్బంది వేతనాలూ ఆ సంస్థ పరిధిలోనే..
ఏప్రిల్ 1 నుంచి ప్రైవేటు సేవలు
ప్రైవేటీకరణపై ఉద్యోగుల అసంతృప్తి

సరైన రవాణా వసతి కూడా లేని మారుమూల పల్లెల్లోకి సైతం వెళ్లి వైద్యసేవలందించే 104 వాహనాలు ఇక ప్రైవేటుపరం కానున్నారుు. సర్కారు వైద్యసేవలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు 104 వంతుకు వచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సేవలను ప్రైవేటుపరం చేయడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఒంగోలు సెంట్రల్: ప్రభుత్వాస్పత్రుల్లో రక్త పరీక్షలు, రేడియాలజీ సేవలు, ఆయూష్ సేవలను ప్రైవేటు వారికి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 104 సేవలను ప్రైవేటీకరించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరోగ్య శాఖలో కీలకమైన 104 సంచార వైద్య సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చే సింది. పిరమిల్ ఎస్‌ఎంఆర్‌ఐ అనే సంస్థకు ఈ సేవలను అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన సదరు సంస్థ ప్రతినిధులు ఏప్రిల్ ఒకటో తే దీ నుంచి 104 సేవలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కసరత్తు మొదలు పెట్టారు. ఈ నెల 13న ఒంగోలులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో వైద్యుల నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. పిరమిల్ ప్రతినిధులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.యాస్మిన్‌ను కలిసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

 అ జిల్లాలో ఎన్ని 104 సంచార వైద్యసేవల వాహనాలు ఉన్నాయి, ఉద్యోగుల సంఖ్య వంటి ప్రాథమిక వివరాలను సేకరించారు. ప్రస్తుతం ఉప జిల్లా ైవె ద్య అధికారుల పర్యవేక్షణలో వాహనాల నిర్వహణ సాగుతుంది. అయితే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే వైద్యసేవలు మెరుగ్గా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.

 అ 104 సంచార వైద్య వాహనం చిన్న సైజు ఆస్పత్రిలా ఉంటుంది. ఇంతటి కీలకమైన సేవలను ప్రభుత్వ యంత్రాంగం నుంచి తప్పించి ప్రైవేటుకు ఇవ్వడం దారుణమని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 అ జిల్లాలో 23 వైద్య వాహనాలు ప్రజల ముంగిటకే ప్రాథమిక వైద్యం అనే నినాదంతో 2009లో ఈ ైవె ద్య సేవలను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ సేవల నిర్వహణను హెచ్‌ఎంఆర్‌ఐ అనే సంస్థకు అప్పగించారు. కాల క్రమంలో 104 సేవల బాధ్యతలను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. జిల్లాలో ప్రస్తుతం 20 వాహనాలు పని చేసే స్థితిలో ఉన్నాయి. ఒక్కో వాహనంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డు ఉంటారు. పల్లెల్లో వైద్యంతో పాటూ ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది.

 ప్రస్తుతం వాహనాలతో పాటూ ఫార్మసిస్టు, ఎల్‌టీ, సెక్యూరిటీ కేడర్లను కూడా కంపెనీ స్వాధీనం చేసుకుంటుంది. ఒక కంప్యూటర్ ఆపరేటర్, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే డీఎంహెచ్‌వో సారథ్యంలో ఉంటారు. అయితే కొన్ని కేడర్లలో మిగులు సిబ్బంది ఉన్నారు. వీరి పరిస్థితి ఏంటనే విషయంలో స్పష్టత లేదు. అన్ని కేడర్ల ఉద్యోగులు మొత్తం 123 మంది ఉంటారు. వీరికి వేతనాలు పిరమిల్ సంస్థ వారు అందజేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని వాహనాల్లో డాక్టర్, స్టాఫ్‌నర్సు ఉంటారు. కంపెనీనే పోస్టులు భర్తీ చేసుకుంటుంది.

104 వైద్య సేవలు పిరమిల్ కంపెనీకి అప్పగించారు డాక్టర్ జె.యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
104 వైద్య సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పిరమిల్ కంపెనీ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి సర్‌ప్లస్ సిబ్బంది మాత్రమే మా పరిధిలోకి వస్తారు. ఉన్న మొత్తం సిబ్బంది కంపెనీ ఆధ్వర్యంలో విధులు నిర్వహించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement