Private Services
-
ప్రైవేటు ఉచ్చులో సంచార వైద్యం
ప్రైవేటీకరణ బాటలో 104 వైద్యసేవలు పిరమిల్ ఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు బాధ్యతలు సిబ్బంది వేతనాలూ ఆ సంస్థ పరిధిలోనే.. ఏప్రిల్ 1 నుంచి ప్రైవేటు సేవలు ప్రైవేటీకరణపై ఉద్యోగుల అసంతృప్తి సరైన రవాణా వసతి కూడా లేని మారుమూల పల్లెల్లోకి సైతం వెళ్లి వైద్యసేవలందించే 104 వాహనాలు ఇక ప్రైవేటుపరం కానున్నారుు. సర్కారు వైద్యసేవలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు 104 వంతుకు వచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సేవలను ప్రైవేటుపరం చేయడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు సెంట్రల్: ప్రభుత్వాస్పత్రుల్లో రక్త పరీక్షలు, రేడియాలజీ సేవలు, ఆయూష్ సేవలను ప్రైవేటు వారికి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 104 సేవలను ప్రైవేటీకరించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరోగ్య శాఖలో కీలకమైన 104 సంచార వైద్య సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చే సింది. పిరమిల్ ఎస్‌ఎంఆర్‌ఐ అనే సంస్థకు ఈ సేవలను అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన సదరు సంస్థ ప్రతినిధులు ఏప్రిల్ ఒకటో తే దీ నుంచి 104 సేవలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కసరత్తు మొదలు పెట్టారు. ఈ నెల 13న ఒంగోలులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో వైద్యుల నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. పిరమిల్ ప్రతినిధులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.యాస్మిన్‌ను కలిసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అ జిల్లాలో ఎన్ని 104 సంచార వైద్యసేవల వాహనాలు ఉన్నాయి, ఉద్యోగుల సంఖ్య వంటి ప్రాథమిక వివరాలను సేకరించారు. ప్రస్తుతం ఉప జిల్లా ైవె ద్య అధికారుల పర్యవేక్షణలో వాహనాల నిర్వహణ సాగుతుంది. అయితే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే వైద్యసేవలు మెరుగ్గా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. అ 104 సంచార వైద్య వాహనం చిన్న సైజు ఆస్పత్రిలా ఉంటుంది. ఇంతటి కీలకమైన సేవలను ప్రభుత్వ యంత్రాంగం నుంచి తప్పించి ప్రైవేటుకు ఇవ్వడం దారుణమని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అ జిల్లాలో 23 వైద్య వాహనాలు ప్రజల ముంగిటకే ప్రాథమిక వైద్యం అనే నినాదంతో 2009లో ఈ ైవె ద్య సేవలను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ సేవల నిర్వహణను హెచ్ఎంఆర్ఐ అనే సంస్థకు అప్పగించారు. కాల క్రమంలో 104 సేవల బాధ్యతలను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. జిల్లాలో ప్రస్తుతం 20 వాహనాలు పని చేసే స్థితిలో ఉన్నాయి. ఒక్కో వాహనంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డు ఉంటారు. పల్లెల్లో వైద్యంతో పాటూ ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాహనాలతో పాటూ ఫార్మసిస్టు, ఎల్టీ, సెక్యూరిటీ కేడర్లను కూడా కంపెనీ స్వాధీనం చేసుకుంటుంది. ఒక కంప్యూటర్ ఆపరేటర్, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే డీఎంహెచ్‌వో సారథ్యంలో ఉంటారు. అయితే కొన్ని కేడర్లలో మిగులు సిబ్బంది ఉన్నారు. వీరి పరిస్థితి ఏంటనే విషయంలో స్పష్టత లేదు. అన్ని కేడర్ల ఉద్యోగులు మొత్తం 123 మంది ఉంటారు. వీరికి వేతనాలు పిరమిల్ సంస్థ వారు అందజేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని వాహనాల్లో డాక్టర్, స్టాఫ్‌నర్సు ఉంటారు. కంపెనీనే పోస్టులు భర్తీ చేసుకుంటుంది. 104 వైద్య సేవలు పిరమిల్ కంపెనీకి అప్పగించారు డాక్టర్ జె.యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి 104 వైద్య సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పిరమిల్ కంపెనీ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి సర్ప్లస్ సిబ్బంది మాత్రమే మా పరిధిలోకి వస్తారు. ఉన్న మొత్తం సిబ్బంది కంపెనీ ఆధ్వర్యంలో విధులు నిర్వహించాలి. -
ఈ గవర్నెన్స్ లక్ష్యంగా ఏపీలో పాలన
-
లక్ష్యం.. ఈ-గవర్నెన్స్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఈ-ఆఫీసులుగా మారుస్తానని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం సచివాలయంలో చంద్రబాబుతో సమావేశమైన విప్రో బృందం ఏపీ రాష్ట్ర ఎంటర్‌ప్రైజర్ ఆర్కిటెక్చర్(ఏపీఎస్ ఇఏ) ప్రాజెక్టుపై ప్రెజంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దశాబ్దం క్రితమే ఈ-సేవ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇవాళ ఈ-ప్రొక్యూర్మెంట్ సహా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు ఎన్నో మీ-సేవా కేంద్రాల్లో లభ్యమవుతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలను ఈ-ఆఫీసులుగా మార్చి తొలి ఈ-గవర్నెన్స్ రాష్ట్రంగా పేరు తెచ్చుకోవడమే ధ్యేయమని చెప్పారు. ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టును ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టడానికి సిద్ధపడాలని, అప్లికేషన్స్, సాప్ట్వేర్ రూపొందించి ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా దీని నిర్వహణలోనూ పాలుపంచుకోవాలని విప్రో ప్రతినిధులకు ఆయన సూచించారు. ఇవాళ అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నామని చెప్పారు. ఏపీని దేశంలోనే తొలి స్మార్ట్ రాష్ట్రంగా మార్చాలన్నదే తన తాపత్రయమన్నారు. ఈ నేపథ్యంలో నూతన రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించడానికి విప్రో వంటి సంస్థలు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు తొలి దశలో రెవెన్యూ, ఆర్థిక, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య వంటి ముఖ్యమైన పది విభాగాలను చేర్చిన విషయాన్ని ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ సీఎంకు వివరించారు. విశాఖలో బిట్స్ పిలానీ: బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ)కు అనుబంధంగా విశాఖపట్నంలో కళాశాల ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా సంసిద్ధత వ్యక్తం చేసిన ట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సచివాలయం లో గురువారం తనతో భేటీ అయిన బిర్లాను రాష్ర్టంలో కళాశాల ఏర్పాటు చేయాల్సిందిగా బాబు కోరారు. విశాఖలో బిట్స్ ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బిర్లాకు చెందిన ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అనువుగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు వద్ద 1866 ఎకరాల విస్తీర్ణంలో సున్నపురాయి గనుల ప్రాస్పెక్టింగ్ లెసైన్సుకు సంబంధించి నిరంభ్యతర పత్రం ఇప్పించాల్సిందిగా తన కార్యాలయ ముఖ్య కార్యదర్శిని బాబు ఆదేశించారు. -
ప్రభుత్వ శాఖల్లో ప్రైవేటు నిపుణుల సేవలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ శాఖల్లో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యత అవసరం ఉండే పోస్టుల్లో ప్రైవేటు రంగానికి చెందిన నిపుణుల సేవలను వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆయా పోస్టులను గుర్తించాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. పరిశ్రమలు, విద్యారంగంతోపాటు ఇతర రంగాల్లోని నిపుణుల సేవలను వినియోగించుకోవడానికి పరిపాలనా సంస్కరణలు తీసుకువస్తామన్న బీజేపీ ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం ఈ దిశలో అడుగులు వేస్తోంది. ఇదేకాక అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శికి సమానమైన ప్రభుత్వ పోస్టుల్లో సాంకేతిక నైపుణ్యం ఉన్న ప్రైవేటురంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులను నియమించాలని ఆరోవేతన సంఘం కూడా సిఫారసు చేసిన నేపథ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) దీనిపై ఓ విధాన పత్రాన్ని రూపొందించింది. -
ఐదేళ్ల కనిష్టానికి అమెరికా నిరుద్యోగ రేటు
వాషింగ్టన్: అమెరికాలో నిరుద్యోగం రేటు నవంబర్‌లో ఐదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది. ఉపాధి కల్పన అవకాశాల వేగం పెరుగుతున్నట్లుగా దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చు. అక్టోబర్‌తో పోల్చితే నిరుద్యోగం రేటు 0.3 శాతం తగ్గి 7 శాతానికి చేరినట్లు కార్మిక శాఖ ప్రకటన ఒకటి పేర్కొంది. అక్టోబర్‌లో 1.13 కోట్లుగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య నవంబర్‌లో 1.09 కోట్లకు తగ్గిందని గణాంకాలు పేర్కొన్నాయి. నిర్మాణం, తయారీ, ప్రైవేటు సేవలు, విద్య, సేవల వంటి రంగాలు మెరుగైన ఫలితాన్ని అందించాయి -
వోల్వోలో భద్రత డొల్లేనా?
= జిల్లాలో 100కు పైగా బస్సులు =రోజుకు 5000 మంది ప్రయాణం = హడలెత్తిపోతున్న ప్రయాణికులు సాక్షి, విజయవాడ : మొన్న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద... నిన్న కర్ణాటకలోని కునిమల్లహళి... వద్ద జరిగిన వోల్వో ప్రమాదాల్లో 50 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో వోల్వో బస్సులో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. అసలు వోల్వో బస్సు తయారీలోనే లోపం ఉందా? లేక యాజమాన్యాల ధనదాహం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయా? తెలియక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో ప్రతి రోజూ 5వేలకు మందిగా పైగా వోల్వో బస్సుల్లో ప్రయాణం సాగిస్తున్నారు. వారాంతం, పండుగ రోజుల్లో ఈ సంఖ్య మరో వెయ్యి పెరగవచ్చు. ఈ నేపథ్యంలో వోల్వోబస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు భద్రతెంత? అని అధికారులను ప్రశ్నిస్తే... మౌనమే సమాధానంగా వస్తోంది. 100కు పైగా బస్సులు... జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీలో 25 వోల్వో బస్సులు ఉండగా, ప్రైవేటు ట్రావెల్స్ ఆధ్వర్యంలో 90 బస్సులున్నాయి. ఇసూజీ, వోల్వో కంపెనీలు రూ.80 నుంచి కోటి 20లక్షలు ఖరీదు చేసే వోల్వో బస్సులు తయారు చేస్తున్నాయి. గంటకు 120 నుంచి 140 కి.మీటర్లవేగంలో బస్సుల్ని నడపవచ్చని వాటి డ్రైవర్లు చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడం వల్ల అంత వేగంతో వెళుతున్నప్పటికీ డ్రైవరుకు కానీ, బస్సులో ప్రయాణికులకు కానీ ఏ మాత్రం కుదుపు ఉండదంటున్నారు. దీంతో ఎంతో ధీమాగా ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రమాదం జరిగినప్పుడు తేరుకునేలోగానే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణికులకు ప్రథమ చికిత్స చేసేందుకు కావాల్సిన వైద్యపరికరాలు వోల్వో బస్సుల్లో ఉండటం లేదు. వోల్వోల్లో భద్రతశూన్యమే! రవాణాశాఖ నిబంధనల ప్రకారం ఏ బస్సులైనా 65 కి.మీటర్లు వేగం మించి వెళ్ల కూడదు. అయితే మన జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ వోల్వో బస్సులు 80 నుంచి 90 కి.మీటర్లు వేగంతోనూ, ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సులు 120 నుంచి 140 కి.మీటర్లు వేగంతో వెళుతున్నాయని అధికారులు అంగీకరిస్తున్నారు. రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు 120 కి.మీ కంటే వేగంగా వెళ్లుతున్న బస్సులే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వోల్వో కంపెనీల బస్సులకు స్పీడ్‌లాక్ ఏర్పాటు చేసినా ప్రైవేటు ఆపరేటర్లు వాటిని తొలగించి వేగాన్ని విపరీతంగా పెంచేస్తున్నారని చెబుతున్నారు. ప్రైవేటు బస్సులతో పోటీపడుతూ ఆర్టీసీ అధికారులు నిబంధనలను పక్కన పెట్టి వోల్వో బస్సులను నడుపుతున్నారు. దీంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. -
రవాణా శాఖ విస్తృత తనిఖీలు
=పమాదాలపై సీరియస్ =రవాణా శాఖ విస్తృత తనిఖీలు =ప్రయివేట్ ట్రావెల్స్ వాహనాపై దాడులు =నిబంధనలు పాటించని 18 బస్సుల సీజ్ =వాల్తేరు డిపోకు తరలింపు =కోర్టు ఆదేశాలతోనే రిలీజ్ ఆర్డర్ సాక్షి,విశాఖపట్నం: రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయివేట్ ట్రావె ల్స్ బస్సులపై దాడులు చేశారు. శుక్రవారం 18 బస్సులను సీజ్ చేశారు. వాటిని విశాఖలోని వాల్తేరు డిపోకు తరలించారు. మూడు రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో వాల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో రవాణా శాఖ అధికారులు మేల్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రయివేట్ ట్రావెల్స్‌పై కొర డా ఝుళిపించారు. విశాఖ డీటీసీ ఎం.ప్రభురాజ్‌కుమార్, శ్రీకాకుళం డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు నేతృత్వంలో శుక్రవారం వేకువజాము 4 గంటల నుంచి విశాఖలోని కూర్మన్నపాలెం, షీ లా నగర్ల వద్ద దాడులు చేశారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. కాంట్రాక్ట్ క్యారియ ర్ పర్మిట్ కలిగి స్టేజి క్యారియర్‌గా రాకపోకలు సాగిస్తున్న 18 బస్సులను సీజ్ చేశారు. రెండు బస్సుల్లో నిబంధనల ప్రకారం ఇద్దరు డ్రైవర్లు లేరని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బస్సులను వాల్తేరు డిపోకు తరలించా రు. ఒకే నంబర్‌తో వాహనాలు తిరుగుతున్నాయా! అనే కోణంలో రికార్డులను క్షుణ్ణంగా పరి శీలించారు. ప్రత్యేకంగా ఒరిజినల్ పర్మిట్లను చూశారు. అపరాధ రుసుం చెల్లింపుతో వాహనాలు విడిచిపెట్టలేమని, కోర్టు రిలీజ్ ఆర్డర్ ఉండాలని ఆంక్షలు విధించారు. శుక్రవారం తనిఖీల్లో దాదాపు 70 బస్సులను పరిశీలించా రు. ట్యాక్స్, ఫిట్నెస్, పర్మిట్, అత్యవసర ద్వా రం, సీట్లు, ప్రయాణికుల సంఖ్య, సరకుల తరలింపు, ఇద్దరు డ్రైవర్ల ఏర్పాటు, మద్యం సేవిం చి ఉన్నారా! అనే అంశాలపై దృష్టి సారించారు. ఇకపై విస్తృతంగా తనిఖీలు చేపడతామని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు చేయరాదని వెల్లడించారు. కానరాని నిబంధనలు ప్రమాదాల సమయంలో నిబంధనలు గుర్తుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారు లు హడావుడి చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సులు అత్యధికంగా స్టేజ్ క్యారి యర్లుగా ప్రయాణించడం వెనుక మతలబు లు లేకపోలేదన్న ఆరోపణలున్నాయి. సీజన్‌ను బట్టి ట్రావెల్స్ అధిక వసూళ్లకు పాల్పడినా పట్టించుకోరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఊరికి దారేది?
సాక్షి, సిటీబ్యూరో : రైళ్లు ఫుల్... ఆర్టీసీ బస్సులు నిల్... ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ... వెరసి దసరా పండక్కి సొంతవూరు వెళ్లాలనుకునేవారికి దిక్కుతోచని పరిస్థితి. మరో మూడు రోజుల్లో పిల్లలకు దసరా సెలవులు. పండగ సందర్భంగా ఇంటిల్లిపాదీ కలిసి సొంతవూరు వెళ్లాలనుకుంటున్న నగర వాసుల ఆశలపై తాజా పరిస్థితులు నీళ్లు చల్లుతున్నాయి. అరవై రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఇప్పటి కే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. పండక్కి మరింత పక్కాగా దోపిడీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇటు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు అవకాశం లేక, రైళ్లలో బెర్తులు లభించక చాలామంది ప్రయాణాలు విరమించుకొంటున్నారు. పిల్లల సెలవులను దృష్టిలో పెట్టుకొని సాహసం చేస్తున్నవాళ్లకు మాత్రం రవాణా కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. చాంతాడంత జాబితా... సీమాంధ్ర సమ్మెను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్యరైల్వే కొన్ని ప్రధాన మార్గాల్లో వందకు పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కొన్ని రైళ్లలో స్లీపర్‌కోచ్‌లు, ఏసీ కోచ్‌లను పెంచారు. కానీ వీటిలో చాలావరకు వారానికి ఒక రోజు, రెండు రోజులు మాత్రమే నడిచే రైళ్లు కావడంతో ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అక్టోబర్ 4 నుంచి 13వ తేదీ వరకు మాత్రమే ప్రజలు పెద్దఎత్తున తరలి వెళ్లే అవకాశం ఉంది. కానీ ఈ రోజుల్లో నడిచే రైళ్లు తక్కువ. దీంతో రెగ్యులర్ రైళ్లపైనే ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తుండగా, మరికొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ బాగా పెరిగింది. గోదావరి, విశాఖ, పద్మావతి, వెంకటాద్రి, మచిలీపట్నం, యశ్వంత్‌పూర్ తదితర ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 300 వరకు పెరిగింది. ఏ ట్రైన్లో ఏ రోజు ‘నో రూమ్’ దర్శనమిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రత్యేక రైళ్లలోనూ రద్దీ కనిపిస్తోంది. సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణ ఏర్పాట్లు చేసుకొంటున్న వాళ్లకు మాత్రం ప్రత్యేక రైళ్లు పెద్దగా ప్రయోజనకరంగా కనిపించడం లేదు. కొన్ని రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నప్పటికీ దసరా సెలవులకు ముందూ, తరువాత మాత్రమే కనిపిస్తూండడంతో చాలామంది ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. కదలని బస్సులు సీమాంధ్ర సమ్మె దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే సుమారు 1500 బస్సులు నిలిచిపోయాయి. 60 రోజులుగా ఆర్టీసీ స్తంభించింది. సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తారు. గత సంవత్సరం దసరా సందర్భంగా 3400 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ.. ఈ ఏడాది సమ్మె కారణంగా చేతులెత్తేసింది. గత సంవత్సరం దసరా సందర్భంగా సుమారు 10 లక్షల మంది ప్రయాణికులు ఒక్క ఆర్టీసీ బస్సుల్లోనే తరలి వెళ్లినట్లు అంచనా. ఈ ఏడాది సీమాంధ్రకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఇప్పటివరకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో తెలంగాణ జిల్లాలకు మాత్రమే 1500 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. ప్రైవేట్ బస్సుల దోపిడీ గత 60 రోజులుగా ప్రయాణికులపై నిలువుదోపిడీ కొనసాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు దసరాకు మరింత పకడ్బందీగా దోపిడీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా.. దసరా సెలవులు ప్రారంభమైన తర్వాత ఈ చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
మోసకారి టీడీపీ నేత ఎక్కడ?
కుత్బుల్లాపూర్/ జీడిమెట్ల, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ జీడిమెట్ల డివిజన్ కోశాధికారి సూరపనేని వెంకట శివాజీ బిచాణా ఎత్తేయడంతో అప్పు ఇచ్చిన బాధితుల దృష్టి ఇప్పుడు అతని ఇంటిపై పడింది. బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లోని ప్రసూననగర్‌లో ఉన్న శివాజీ ఇంటికి వచ్చి పలువురు పడిగాపులు కాస్తూ కనిపించారు. మరికొంత మంది తాళం వేసిన ఇంటికి మళ్లీ తాళాలు వేస్తూ కన్పించారు. వంద గజాల్లో గ్రౌండ్ ప్లస్ 3 భవనాన్ని నిర్మించగా దీని ఖరీదు రూ. 50 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం. సొంతూరైన కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో సైతం ఇటీవల నూతన గృహాన్ని నిర్మించాడు. గ్రామానికి వెళ్తున్న సందర్భంలో అక్కడి వారి ముందు తాను గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ కార్పొరేటర్ అంటూ బీరాలు పలికేవాడని తెలిసింది. అంతే కాకుండా నగరం నుంచి విజయవాడకు మూడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నట్లు బాధితులు కనుగొన్నారు. అయితే ఆ బస్సులు ఎక్కడ నుంచి వెళ్తున్నది, ఏ ట్రావెల్స్ పేరు మీద ఉన్నాయన్న విషయం తెలుసుకునేందుకు ఒక వైపు బాధితులు, మరో వైపు పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రసూననగర్, వివేకానందనగర్, శ్రీనివాస్‌నగర్ ప్రాంత వాసులే కాకుండా బాలానగర్‌లోని లోకేష్ కంపెనీ ఉద్యోగులు మోసపోయిన వారిలో అధికంగా ఉన్నారు. సోమవారం రాత్రి 60 మంది పోగై లెక్కలు చూసుకోగా రూ. 5 కోట్లు రాగా, మంగళవారం అది రూ. 15 కోట్లకు చేరింది. తాజాగా కృష్ణా జిల్లాలో సైతం ఇతగాని చిట్టా భారీగానే ఉందని బాధితుల ద్వారా వెలుగులోకి వస్తోంది. ఏది ఏమైనా ఈ కేసును త్వరగా చేధించే దిశగా జీడిమెట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రహస్య ప్రదేశాల్లో విసృ్తత తనిఖీలు చేస్తున్నాయి. ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు.. సూరపనేని వెంకట శివాజీ రూ. 5 లక్షలు, రూ. 2 లక్షలు చిట్టీలు వేసి పలువురి వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుండా వారికి రూ. 3 చొప్పున వడ్డీ చెల్లించేవాడు. పలువురికి సంవత్సరం, రెండు సంవత్సరాలు వడ్డీ కట్టేవాడని తెలిసింది. అయితే వారు న్యాయ సలహా తీసుకుని ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే 15 మంది ఫిర్యాదు చేయగా లక్షల్లో అప్పులిచ్చిన వారు ఐటీ రిటర్న్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న భయంతో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. శివాజీని ఎలాగైనా పట్టుకుని తమ డబ్బులు వసూలు చేసుకుంటామనే ధీమాతో మరికొందరు ఉన్నారు.