
బస్టాండ్ విద్యుత్ కాంతులతో మెరవాలి
విజయవాడ(బస్‌స్టేషన్) : రాత్రివేళలో ప్రకాశం బ్యారేజీ ఏవిధంగా విద్యు™Œ కాంతులతో వెలిగిపోతుందో, బస్టాండ్ కూడా ధగధగలాడాలని, ఆకాంతులు శాశ్వతంగా ఉండాలని ఆర్టీసీ విజయవాడ జోన్ (కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి) ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ)వెంకటేశ్వరరావు అన్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సోమవారం ఆయన పర్యటించారు. బస్టాండ్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. బస్టాండ్ శుభ్రత, ప్రచారాలు తదితర వాటిపై బస్టాండ్ అధికారుల్ని అడిగితెలుసుకున్నారు. ఈడీ మాట్లాడుతూ ప్రజలు వినియోగిస్తున్న సోషల్ మీడియా(గూగుల్)లో బస్టాండ్ రూపురేఖల్ని పొందుపరచాలని, వినూత్న ప్రచారాలు చేయాలన్నారు. బస్టాండ్‌లో నూతన నిర్మాణాలపై తెల్లరంగు వేసి, రకరకాల రంగుల కాంతులు వెదజల్లె విద్యుత్ దీపాలంకరణ చేయాలని సూచించారు. ఆ విద్యుత్ కాంతులు శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనతోపాటు రీజనల్ మేనేజర్ రామారావు, బస్టాండ్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జాన్‌సుకుమార్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ అప్పారావు, విజిలెన్స్ సీఐ మధుసూదనరావు తదితరులు ఉన్నారు.