
మనీ.. అదే పరేషానీ!
వరంగల్ రూరల్ జిల్లాలో పనిచేయని ఏటీఎంలు
బ్యాంకర్లు బిజీ బిజీ.. రైతుల రుణాలపై పట్టింపు కరువు
కొత్త రుణం ఇచ్చేది లేదు.. పాత బకారుు తీసుకోవడానికీ నిరాకరణ
పెళ్లిళ్లు సైతం వారుుదా వేసుకునే పరిస్థితి
పాత నోట్లు తీసుకోవడంతో భారీగా విద్యుత్, ఆస్తి పన్నుల వసూలు
హన్మకొండ : కేంద్రప్రభుత్వం రూ.500, రూ.వెరుు్య కరెన్సీ నోట్లను రద్దు చేసిన సందర్భంగా ఏర్పడిన ఇబ్బందులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారుు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని పట్టణాలు, మండలాల్లో శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఏటీఎంలు పనిచేయకపోవడంతో నగదు కోసం పలువురు ఆందోళనకు గురయ్యారు. బ్యాంకుల వద్ద ఉదయం నుంచి వందల సంఖ్యలో ప్రజలు క్యూలో నిల్చున్నప్పటికీ స్వల్ప మొత్తాల్లో మాత్రమే నగదు ఇస్తుండడంతో వారి సమస్యలు తీరడం లేదు. ఇక యాసంగికి సంబంధించి రైతులకు మంజూరైన రుణం మొత్తాన్ని ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తుండడంతో రబీకి సిద్ధమైన రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు.
ఉన్న పనికే సమయం చాలక, కరెన్సీ సరిపోక ఇబ్బందులు పడుతుంటే రైతుల రుణాల గురించి పట్టించుకునే సమయం లేదని బ్యాం కర్లు చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. చివరకు గతంలో తీసుకున్న పంట రుణం చెల్లించేందుకు వచ్చినా పలు ప్రైవేట్ ఫైనాన్‌స కంపెనీల బాధ్యులు నిరాకరిస్తున్నారు. మరోవైపు సినిమా థియేటర్లు, వ్యాపార దుకాణాల్లో రద్దీ లేక వెలవెలపోయారుు. సాధారణంతో పోలిస్తే 30శాతం కంటే తక్కువ వ్యాపారం జరిగింది.
‘పెళ్లి’ తిప్పలు
ఖరీఫ్ సీజన్ పూర్తి కావడంతో కార్తీక మాసం కావడంతో చాలామంది రైతులు తమ ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెట్టుకున్నారు. ఇందుకోసం నగదు సిద్ధం చేసుకున్నారు. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి కార్డు చూపించినప్పటికీ బ్యాంకర్లు కనికరించడంలేదని గగ్గోలు పెడుతున్నారు. కొందరు చెక్కుల రూపంలో చెల్లిస్తుండగా.. మరికొందరు కార్యాలనే వారుుదా వేసుకుంటున్నామని చెబుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లికి చెంది న కొండ్లె అశోక్, రాజక్క దంపతుల కుమార్తె రాణి వివాహం ఈనెల 15న పెట్టుకున్నారు. ఇందుకోసం రూ.1.50లక్షలు సిద్ధం చేసుకోగా ఇప్పుడు కరెన్సీ సమస్య రావడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భూపాలపల్లి మండలం చిట్యాల మండలం బడిదెలకు చెందిన ఓ వ్యక్తి తమ కుమార్తె వివాహానికి రూ.5లక్షలు సిద్ధం చేసుకోగా ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో ఈనెల 16న జరగాల్సిన వివాహాన్ని వారుుదా వేసుకునేందుకు నిర్ణరుుంచారు.
14వ వరకు చెల్లించొచ్చు..
వరంగల్ రూరల్ : రిజర్వు బ్యాంకు ఇండియా(ఆర్‌బీఐ) రద్దు చేసిన రూ.500, రూ.వెరుు్య నోట్లతో ప్రజలు తమ ఆస్తి, నల్లా పన్నులు, ట్రేడ్ లెసైన్సులు, విద్యుత్ బకారుులను ఈనెల 14వ తేదీ వరకు చెల్లించొచ్చని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. నర్సంపేట, పరకాల నగరపంచాయతీల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.