కడప అర్బన్ : పోలీసు కానిస్టేబుల్ సివిల్, ఏఆర్, జైలు వార్డర్ ఉద్యోగాల కోసం ప్రాథమిక పరీక్ష అర్హత సాధించి దేహదారుఢ్య పరీక్షల కోసం వచ్చే అభ్యర్థులంతా తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చాలామంది ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు తీసుకు రావడం లేదన్నారు. ఉద్యోగానికి రిజర్వేషన్ కావాలనుకున్న బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు 2014 జనవరి తర్వాత జారీ చేసిన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకు రావాలని ఎస్పీ వివరించారు. అనెక్జర్5లో వాటిని తహసీల్దార్ నుంచి పొందాలని చెప్పారు. అలా తీసుకురాని అభ్యర్థులకు ఉద్యోగ ఎంపికలో రిజర్వేషన్ వర్తించదన్నారు. రిక్రూట్‌మెంట్.ఏపీ పోలీసు.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో తాజాగాఉంచిన స్టేజ్2 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఉన్న కాలమ్‌లను పూర్తి చేయాలన్నారు. శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా దీనిని తీసుకునిరావాలని ఎస్పీ కోరారు.
.
ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి
Published Sat, Dec 3 2016 10:43 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM
Advertisement