SP PHD Ramakrishna
-
పోలీస్‌స్టేషన్‌పై దాడి హేయమైన చర్య
గూడూరు: రాపూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి హేయమైన చర్య అని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ విషయమై కొన్ని చానళ్లలో వాస్తవాలు చూపకుండా వక్రీకరించారని తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వీఎస్ రాంబాబుతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాపూరుకు చెందిన జోసఫ్ అనే వ్యక్తి సుబ్బరాయులుకు గతంలో రూ.2వేలు ఇచ్చి ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జోసఫ్ భార్య దీనమ్మ అతని వద్దకు వెళ్లి నగదు ఇవ్వాలని కోరగా అతను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. ఈ క్రమంలో జోసఫ్ బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారన్నారు. అతనుతో పాటు కొందరు మద్యం సేవించి ఉండగా వారిని బయటే ఉండాలని పోలీసులు సూచించారని తెలిపారు. పోలీసులను మద్యం తాగి దూషిస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిని పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకెళ్లారన్నారు. దీంతో ఏదో జరుగుతున్నట్లు వక్రీకరించి కొందరు దళితవాడలోని ప్రజలను రెచ్చగొట్టే విధంగా సమాచారం ఇవ్వడంతో కాలనీ నుంచి కొంతమంది పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీసులు సంయమనం పాటించారే తప్ప వారిపై ఎలాంటి దాడి చేయలేదని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఎం.పిచ్చయ్య, కె.రమేష్, రంగయ్య, జార్జి, ఎం.వేమయ్య, ఆర్.రాజేష్. ఎం.లక్ష్మి, ఎం.పెంచలమ్మ, వరలక్ష్మి, పి.కనకమ్మ, ఆర్.పెంచలమ్మ, ఆర్.హైమావతితో పాటు రాపూరు గ్రామ సర్పంచ్ భర్త తుమ్మలపల్లి మధుసూదన్‌రావు ప్రమేయం ఉందని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. దాడి అమానుషం గూడూరు రూరల్: పోలీసు స్టేషన్లోకి చొరబడి సిబ్బందిపై దాడి చేయడం అమానుష చర్య అని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పేర్కొన్నారు. గూడూరు రూరల్ పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. రాపూరు పోలీసు స్టేషన్‌పై అక్కడి దళితులు బుధవారం రాత్రి దాడి చేసి ఎస్సై, సిబ్బందిని గాయపరిచారు. ఈ విషయంపై ఎస్పీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడిన వారిలో 30 మందిని గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇరువర్గాలను పిలిచి రాపూరు ఎస్సై లక్ష్మణరావు మాట్లాడుతుండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడన్నారు. గొడవకు దిగిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా అతనికి సంబంధించిన బంధువులు ఒక్కసారిగా మూకుమ్మడిగా పోలీసు స్టేషన్లోకి చొరబడి విచక్షణారహితంగా ఎస్సై, సిబ్బందిపై దాడికి తెగబడ్డారన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
పోలీస్ శాఖలో కుదుపు
నెల్లూరు (క్రైమ్): పోలీస్ శాఖను క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఎస్పీ పీహెచ్‌డి రామకృష్ణ చర్యలు చేపట్టారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ పోలీస్ విభాగానికి మచ్చతెస్తున్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని తన చర్యల ద్వారా సంకేతాలిస్తున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోఏళ్ల తరబడి పాతుకుపోయిన 42 మంది మినిస్టీరియల్ సిబ్బందిపై బదిలీ వేటు వేసిన ఎస్పీ 24 గంటలు గడవకముందే అవినీతిపరులైన 52 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని వీఆర్‌కు పంపిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భారీ స్థాయిలో పోలీస్ సిబ్బందిని వీఆర్‌కు పిలవడం ఇదే ప్రథమం. ఫిర్యాదుల నేపథ్యంలో.. క్రికెట్ బెట్టింగ్, ఎర్ర చందనం, ఇసుక అక్రమ రవాణా, గుట్కా మాఫియాలకు సహకరించడం, బాధితులను నిలువు దోపిడీకి గురిచేయడం, కేసులను నీరుగార్చడం, విధులను నిర్లక్ష్యం చేస్తూ ఏళ్ల తరబడి పాతుకుపోయిన పోలీసు అధికారులు, మఫ్టీ (జీడీ) కానిస్టేబుల్స్, హోంగార్డులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటిపై నిఘా విభాగం నుంచి వివరాలు సేకరించిన ఎస్పీ 52 మందితో కూడిన జాబితాను తయారుచేశారు. మంగళవారం వారందరిపైనా వీఆర్ వేటు వేశారు. వెంటనే వి«ధుల నుంచి రిలీవ్ చేయాలంటూ ఆదేశించారు. మునుపెన్నడూ లేనివిధంగా హోంగార్డులను సైతం వీఆర్‌కు పిలిచారు. 24 గంటల వ్యవధిలో 42 మంది పరిపాలన సిబ్బందిని బదిలీ చేయడం, 52 మంది పోలీస్ సిబ్బందిని వీఆర్‌కు పిలవడం పోలీస్ శాఖను చర్చనీయాంశమైంది. వీరిలో 30 మంది కానిస్టేబుల్స్ కాగా, ఒక ఎస్సై, నలుగురు ఏఎస్సైలు, ఏడుగురు హెడ్ కానిస్టేబుల్స్, 10 మంది హోంగార్డులు ఉన్నారు. శాఖాపరమైన అవినీతిని నిర్మూలించే దిశగా ఎస్పీ చేపడుతున్న చర్యలు కలకలం రేపుతున్నాయి. ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనన్న భయాందోళన ఆ శాఖ ఉద్యోగుల్లో నెలకొంది. అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తూనే.. ఓ వైపు అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తూనే సొంత శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపైనా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ దృష్టి సారించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలకు సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లను ఇప్పటికే వీఆర్‌కు పంపించిన విషయం విదితమే. గతంలో చిల్లకూరు, తడ పోలీస్ స్టేషన్లలో పనిచేసిన ఇద్దరు ఎస్సైలు కేసులను నీరుగార్చి, భారీగా నగదు కూడగట్టారని, అప్పటి డీఎస్పీకి అన్నీ తామై వ్యవహరించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై విచారణ జరిపిన ఎస్పీ ఇద్దరు ఎస్సైలను ఇటీవల వీఆర్‌కు పిలిచారు. వారికి సహకరించిన సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌పై సైతం వీఆర్ వేటు వేశారు. పోలీస్ పరిపాలన విభాగంలోని కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి అక్కడే పాతుకుపోవడాన్ని గమనించిన ఆయన సోమవారం 42 మంది మినిస్టీరియల్ సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీలకు ఎవరూ అతీతులు కారని నిరూపించారు. -
ఆట.. ఏమైందో వేట
► క్రికెట్ బెట్టింగ్ కేసులో టీడీపీ నేతలకు మినహాయింపు! ► 25 రోజులుగా అజ్ఞాతంలోనే అధికార పార్టీ బుకీలు ► పోలీసులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ► కేసును వైఎస్సార్ సీపీ నేతలపై నెడుతూ మైండ్‌గేమ్ ► పోలీస్ కస్టడీకి కృష్ణసింగ్, మరో నలుగురు ► నేటినుంచి రెండోదఫా విచారణ నెల్లూరు : జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ రాకెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కీలక బుకీలను శనివారం నుంచి పోలీస్ కస్టడీకి తీసుకుని మరోసారి విచారణ జరిపేందుకు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సిద్ధమవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అధికార పార్టీలో మళ్లీ అలజడి మొదలైంది. ఇదిలావుంటే.. 25 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ నేతలను పోలీసులు ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై అధికార పార్టీ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని.. మంత్రులు, ఎమ్మెల్సీలు స్వయంగా రంగంలోకి దిగి వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. మళ్లీ మొదలు సమర్థవంతమైన అధికారిగా జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు పేరుంది. గతంలో ఆయన పనిచేసినచోట అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెట్టింగ్ రాకెట్‌పై దృష్టి సారించారు. మూలాలతోసహా రాకెట్ గుట్టును రట్టు చేసి 115 మందిని మొదటి విడతలో అరెస్ట్ చేశారు. వీరిలో కీలక బుకీగా ఉన్న కృష్ణసింగ్‌తోపాటు మరో 8 మంది ప్రధాన బుకీలు, వారి అనుబంధంగా ఉండే 15 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది బుకీలను, పంటర్లను సైతం అరెస్ట్ చేసి వారి పాత్ర ఏ మేరకు ఉందనేది నిర్ధారించారు. జిల్లాలో సీఐలు, డీఎస్పీలే బెట్టింగ్ రాకెట్‌ను పెంచి పోషించారనే వాదన బలంగా ఉంది. ఈ క్రమంలో వారి పాత్రను కూడా నిర్ధారించి ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలను వీఆర్‌కు పంపారు. ఆ తరువాత ఈ వ్యవహారంపై ఐదు రోజులపాటు స్తబ్దత నెలకొనగా.. తాజాగా కీలక బుకీలను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టనుండటంతో రాజకీయ నేతల్లో అలజడి రేగుతోంది. ప్రధాన బుకీ కృష్ణసింగ్, షంషీర్, అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని శనివారం అధీనంలోకి తీసుకుని పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు సన్నద్ధమయ్యారు. బుకీల నుంచి ఎవరెవరికీ మామూళ్లు అందాయనే దానిపైనే కీలకంగా విచారణ సాగుతోంది. పోలీసు శాఖతోపాటు రాజకీయ మామూళ్లు, బుకీలకు అండదండలు అందిస్తున్న ముఖ్యనేతలకు సంబంధించిన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇంకా పరారీలోనే.. ఇదిలా ఉంటే బెట్టింగ్ రాకెట్ విషయంలో మొదటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్న పోలీసులు బుకీలుగా ఉన్న ఇద్దరు టీడీపీ నేతలను అరెస్ట్ చేయకపోవడంపై అనేక అనుమానాలకు తెరలేచింది. తెలుగుదేశంపార్టీ మాజీ కౌన్సిలర్ దువ్వూరు శరత్చంద్ర, అతని కుమారుడు కీలక బుకీలుగా ఉన్నారు. మంత్రులు, మాజీ మంత్రులతో శరత్చంద్రకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత నెలలో మంత్రి నివాసంలో జరిగిన విందులో అన్నీ తానే అన్నట్టు కీలకంగా వ్యవహరించాడు. శరత్చంద్ర, అతని కుమారుడు ఇద్దరూ నగరంలో కొన్నేళ్లుగా కీలక బుకీలుగా వ్యవహరిస్తూ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు. టీడీపీలో నామినెటేడ్ పదవి అనుభవిస్తున్న నేతకు ముఖ్య అనుచరుడైన బ్రహ్మనాయుడు కూడా కీలక బుకీగా వ్యవహరిస్తున్నాడు. బ్రహ్మనాయుడు రూ.లక్షల్లో బెట్టింగ్ నిర్వహించడంతోపాటు వందల మంది ద్వారా బెట్టింగ్ రాకెట్‌ను నడుపుతూ కీలక బుకీగా నగరంలో ఎదిగాడు. వీరంతా 25 రోజుల నుంచి పరారీలోనే ఉన్నారు. పోలీసు బృందాలు వీరి ఆచూకీ కోసం అన్వేషించినా దొరకని పరిస్థితి. పరారీకి అధికార పార్టీ నేతలే పూర్తిస్థాయిలో సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసులపై కూడా అధికార పార్టీ నేతలు బలమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీరిని తప్పించడం కోసం బెట్టింగ్ రాకెట్ వ్యవహారం మొత్తాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపైకి నెట్టేలా అధికార పార్టీ నేతలు మైండ్ గేమ్‌కు తెరలేపారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలను కీలకంగా చూస్తున్న ఎమ్మెల్సీ కనుసన్నల్లోనే బుకీలందరూ ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. కృష్ణసింగ్ మొదలుకొని బ్రహ్మనాయుడు వరకు అందరూ పెద్ద మొత్తాలను సదరు ఎమ్మెల్సీకి ముట్టజెప్పడం, వారిపై కేసులు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తేవడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలో బెట్టింగ్ రాకెట్ వేట కొనసాగుతున్న తరుణంలోనూ సదరు ఎమ్మెల్సీ మంత్రుల ద్వారా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అరెస్ట్‌లు అనివార్యమని పోలీసులు పరోక్షంగా చెప్పడంతో వారిద్దరినీ పరారీలోనే కొనసాగేలా చూస్తున్నారు. -
ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి
కడప అర్బన్ : పోలీసు కానిస్టేబుల్ సివిల్, ఏఆర్, జైలు వార్డర్ ఉద్యోగాల కోసం ప్రాథమిక పరీక్ష అర్హత సాధించి దేహదారుఢ్య పరీక్షల కోసం వచ్చే అభ్యర్థులంతా తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చాలామంది ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు తీసుకు రావడం లేదన్నారు. ఉద్యోగానికి రిజర్వేషన్ కావాలనుకున్న బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు 2014 జనవరి తర్వాత జారీ చేసిన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకు రావాలని ఎస్పీ వివరించారు. అనెక్జర్5లో వాటిని తహసీల్దార్ నుంచి పొందాలని చెప్పారు. అలా తీసుకురాని అభ్యర్థులకు ఉద్యోగ ఎంపికలో రిజర్వేషన్ వర్తించదన్నారు. రిక్రూట్మెంట్.ఏపీ పోలీసు.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో తాజాగాఉంచిన స్టేజ్2 ఆన్లైన్ అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న కాలమ్‌లను పూర్తి చేయాలన్నారు. శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా దీనిని తీసుకునిరావాలని ఎస్పీ కోరారు. . -
పోలీసుల సంక్షేమం కోం కృషి
కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు యంత్రాంగం, వారి కుటుంబాల సంక్షేమం కోసం కషి చేస్తున్నామని ఎస్పీ పీహెచ్డీ రామకష్ణ తెలిపారు. జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ మాట్లాడుతూ నిరంతరం పోలీసు యంత్రాంగం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం తాము కృషి చేస్తామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని పేర్కొన్నారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నాయకులు ఎస్పీకి సమర్పించారు. సమావేశంలో ఓఎస్డీ సత్య ఏసుబాబుతోపాటు పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాయకుల నారాయణ, ప్రధాన కార్యదర్శి రాజరాజేశ్వరరెడ్డి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరుక్రైం: హోంగార్డుల సంక్షేమానికి సహాయ సహకారాలు అందజేస్తానని రూరల్ జిల్లా ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ చెప్పారు. నగరంపాలెం పోలీసు పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం హోంగార్డు దర్బార్ నిర్వహించారు. ముందుగా హోంగార్డుల సమస్యలను తెలుసుకున్నారు. తమ తెల్ల రేషన్ కార్డులను అధికారులు రద్దుచేశారని, ప్రభుత్వ ఉద్యోగులం కాదని చెప్పినా వినలేదని పలువురు వివరించారు. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే నాణ్యమైన వైద్యచికిత్స అందించలేకపోతున్నామని వాపోయూరు. హెల్త్‌కార్డులు ఇవ్వటంతోపాటు విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు ఆపద్భందు పథకాన్ని వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో హోంగార్డు మృతి చెందినా, రిటైరైనా జిల్లాలోని హోంగార్డుల నుంచి రూ.100లు చొప్పున వసూలు చేసి ఆ డబ్బును వారి కుటుంబ సభ్యులకు అందించేవారమని, ఈ విధానం కొద్దిరోజులుగా నిలిచిపోయిందని, దీనిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ రామకృష్ణ స్పందిస్తూ విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. హెల్త్‌కార్డులు, ఆపద్బంధు పథకం వర్తింపు, తెల్లరేషన్ కార్డుల తొలగింపు అంశాలను కలెక్టర్ కాంతిలాల్ దండే దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మృతి చెందిన, రిటైరైన హోంగార్డుల కుటుంబాలకు ఇచ్చేందుకు విరాళాలు వసూలు చేసుకునే అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కొందరు హోంగార్డులపై ఆరోపణలు వస్తున్న దృష్ట్యా డివిజన్ స్థాయి బదిలీలను కొనసాగిస్తామని చెప్పారు. ఎవరైనా సిఫార్సులు చేయిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. గురజాల, నరసరావుపేట, గుంటూరు, బాపట్లలో త్వరలో ఏర్పాటు చేయబోయే పోలీసు సబ్సిడీ క్యాంటిన్లలో ప్రతి నెలా రూ.3 వేల విలువైన సరుకులు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, అవినీతికి పాల్పడినా ఉద్యోగం నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రామాంజనేయులు, ఏఆర్డీఎస్పీ బి.సత్యనారాయణ, ఇన్చార్జి హోంగార్డు ఆర్ఐ సంకూరయ్య, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు.