పోలీసుల సంక్షేమం కోం కృషి | The welfare of the police effort | Sakshi
Sakshi News home page

పోలీసుల సంక్షేమం కోం కృషి

Published Fri, Sep 2 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

పోలీసుల సంక్షేమం కోం కృషి

పోలీసుల సంక్షేమం కోం కృషి

కడప అర్బన్‌ : జిల్లాలోని పోలీసు యంత్రాంగం, వారి కుటుంబాల సంక్షేమం కోసం కషి చేస్తున్నామని ఎస్పీ పీహెచ్‌డీ రామకష్ణ తెలిపారు. జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ మాట్లాడుతూ నిరంతరం పోలీసు యంత్రాంగం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం తాము కృషి చేస్తామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని పేర్కొన్నారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నాయకులు ఎస్పీకి  సమర్పించారు. సమావేశంలో ఓఎస్‌డీ సత్య ఏసుబాబుతోపాటు పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాయకుల నారాయణ, ప్రధాన కార్యదర్శి రాజరాజేశ్వరరెడ్డి, అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement