ఆటో, బైక్‌ ఢీ.. ఆరుగురికి గాయాలు | Auto, bike accident and six injuries | Sakshi
Sakshi News home page

ఆటో, బైక్‌ ఢీ.. ఆరుగురికి గాయాలు

Sep 11 2017 10:44 PM | Updated on Aug 30 2018 4:15 PM

గాజులపల్లి ఆదర్శ పాఠశాల సమీపాన కదిరి ప్రధానరహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఓడీ చెరువు నుంచి అమడగూరుకు ప్రయాణికులతో వస్తున్న ఆటో, అమడగూరు నుంచి కదిరి వైపు వెళుతున్న ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి.

అమడగూరు: గాజులపల్లి ఆదర్శ పాఠశాల సమీపాన కదిరి ప్రధానరహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఓడీ చెరువు నుంచి అమడగూరుకు ప్రయాణికులతో వస్తున్న ఆటో, అమడగూరు నుంచి కదిరి వైపు వెళుతున్న ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఆటోలో ప్రయాణిస్తున్న అమడగూరుకు చెందిన నంజుండప్ప, హుసేన్‌, కర్ణాటక సాంకుపల్లికి చెందిన నారాయణస్వామిలకు కాళ్లు విరగ్గా.. పేరంవాండ్లపల్లికి చెందిన నరసింహులు, అమడగూరుకు చెందిన రాములమ్మ, ద్విచక్ర వాహనదారుడు మలక రాజారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. కస్సముద్రంకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, గుండువారిపల్లికి చెందిన గంగులప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఏఎన్‌ఎంలు, హెల్త్‌ సూపర్‌వైజర్లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేశారు. గంట అనంతరం 108, ప్రైవేట్‌ వాహనాలలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement