ఆటోను ఢీకొట్టిన కారు | Auto collision car | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన కారు

Published Mon, Sep 5 2016 12:21 AM | Last Updated on Tue, Oct 2 2018 8:18 PM

Auto collision car

  • ∙ఇద్దరికి తీవ్రగాయాలు
  • జనగామ : పట్టణంలోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఆటో ను కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళకు తీవ్రగాయాలవగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది.ఈ సంఘటన ఆదివారం రాత్రి జరి గింది. జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్‌ గ్రామానికి చెందిన తేజావత్‌ లక్ష్మి సంతోషిమాత ఆలయంలో పనిచేస్తోంది. సాయంత్రం అంబేద్కర్‌ నగర్‌కు వెళ్లిన లక్ష్మి ఆటోలో తిరిగి వస్తోంది. నెహ్రూ పార్కు వరకు రాగానే గిర్నిగడ్డలో నివాసముంటున్న భవన నిర్మాణ కార్మికుడు కనికె కుమార్‌ అదే ఆటోలో ఎక్కాడు. బ్రిడ్జి మధ్యలోకి వెళ్లగానే ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీకొంది. దీంతో కుమార్‌ కాలు నుజ్జునుజ్జయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆటో వెనుక భాగంలో కూర్చున్న మహిళకు కాలు విరిగింది. ఆమెను 108లో ప్రభుత్వ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన కారు డ్రైవర్‌ పరారయ్యాడు. కాగా, కుమార్‌ బతుకు దెరువు కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి జనగామకు వలస వచ్చాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement