![సాక్షి టీవీకి అవార్డు](/styles/webp/s3/article_images/2017/09/3/71446134751_625x300.jpg.webp?itok=Q9_rRAiP)
సాక్షి టీవీకి అవార్డు
హైదరాబాద్: రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమానికి సాక్షి టీవీ అవార్డును దక్కించుకుంది. గురువారం రవీంద్ర భారతిలో పద్మమోహన్ ఆర్ట్స్ టీవీ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ అవార్డులను తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనా చారి అందించారు. ఈ సందర్భంగా ఉత్తమ వ్యవసాయ కార్యక్రమం 'రైతు రాజ్యం'కుగానూ సాక్షి టీవీకి అవార్డును అందించారు.