రంగస్థల నటులకు ‘కందుకూరి’ పురస్కారాలు | awards to drama artists | Sakshi
Sakshi News home page

రంగస్థల నటులకు ‘కందుకూరి’ పురస్కారాలు

Published Mon, May 1 2017 1:22 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

రంగస్థల నటులకు ‘కందుకూరి’ పురస్కారాలు - Sakshi

రంగస్థల నటులకు ‘కందుకూరి’ పురస్కారాలు

సాక్షి, రాజమహేంద్రవరం :  జిల్లాలో రంగస్థలంలో కొన్నేళ్లుగా మంచి ప్రతిభ కనబరుస్తూ నాటక రంగ అభివృద్ధికి కృషి చేసిన వారిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి కందుకూరి వీరేశలింగంపేరు మీదుగా విశిష్ట పురస్కారం అందజేసింది. ఈ మేరకు ఆదివారం రాజమహేంద్రవరంలో ఎంపిక చేసిన వారికి పురస్కారం పేరుతో రూ. 10వేల నగుదు బహుమతి, ప్రశంసాపత్రం స్పీకర్‌ కోడెల శివప్రసాద్, ఎం పీ మురళీమోహన్‌ తదితరుల చేతుల మీదుగా అందించారు.

జిల్లాకు ఐదుగురు చొప్పున 13 జిల్లాలకు 65 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిని ఎంపీ మురళీమోహన్, డాక్టర్‌ పెద్ది రామారావు, ఎస్‌.కె. మిస్రో, పాటిబండ్ల ఆనందరావు, ఎస్‌.బాలచంద్రరావు, పి.ఓబుల య్య, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎస్‌.వెంకటేశ్వర్‌లతో కూడిన ఏడుగురు సభ్యుల కమిటీ ఎంపిక చేసింది. శ్రీకాకుళం నుంచి గోకవలస కృష్ణమూర్తి, పి.సూర్యనారాయణ, ఎస్‌.రమణ, వాకమళ్ల సరోజిని, బస మురళీలు కందుకూరి విశిష్ట పురస్కారం అందుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement