
సేకరించిన పూలతో చిన్నారులు
మిరుదొడ్డి: బతుకమ్మ సంబరాల్లో చిన్నారులు మునిగి తేలుతున్నారు. రంగురంగుల పూలను సేకరించడంలో బిజీ అయ్యారు. ఆ పూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం పూట మహిళలతో కలిసి ఆడుతూ ఆనందంగా గడుపుతున్నారు. ఆదివారం మిరుదొడ్డిలో చిన్నారులు పూల సేకరణలో బిజీబిజీగా గడుపుతూ కన్పించారు.