అమరుల త్యాగాలు వృథా కానివ్వం
-
∙స్పీకర్ మధుసూదనాచారి
భూపాలపల్లి : తెలంగాణ అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రత్యేక రా ష్ట్రంకోసం ఆత్మబలి దానం చేసుకున్న మండలంలోని గొర్లవీడు గ్రామానికి చెం దిన వీణవంక శ్రీనివాసాచార్యులు, ఆజంనగర్‌కు చెందిన బీరెల్లి రాములు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.10 లక్షల చెక్కులను గురువారం అందజేశారు.
అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్నారని అన్నారు. అమరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండ గా నిలుస్తుందన్నారు. ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తు న్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయ ణ, ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, వైస్ ఎంపీపీ సురేందర్, జెడ్పీటీసీ సభ్యురాలు జ ర్పుల మీరాబాయి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, నాయకులు ముద్దమల్ల బార్గవ్, తాటి వెంకన్న, గోవిందుల శ్యాం, మారెల్లి సేనాపతి పాల్గొన్నార