speker
-
‘అయోధ్య ఎంపీకే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి!’
ఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్ పదవికి 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగ్గా అధికార ఎన్డీయే కోటా ఎంపీ ఓం బిర్లా తిరిగి ఎన్నిక అయ్యారు. అయితే అధికార ఎన్డీయే ఏకగ్రీవానికి ప్రయత్నించినా.. ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పట్టుపట్టడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. స్పీకర్ ఎన్నిక పూర్తికావడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే చర్చ మొదలైంది.అయితే తాజాగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్‌కు కేటాయించాలని టీఎంసీ కేంద్రాన్ని కోరుతోంది. ఆయోధ్య ఉన్న ఫైజాబాద్ సెగ్మెంట్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన అవధేష్ ప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి షెడ్యూల్ విడుదలచేయలేదు. గతంలో 17వ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీయేలోని ఏ మిత్రక్షానికి కూడా ఇవ్వకుండా బీజేపీ ఖాళీగా ఉంచిన ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి బలమైన నాయకున్ని ఇండియా కూటమి పోటీలోకి దింపాలనుకుంటున్న నేపథ్యంలో ఎంపీ అవధేష్ ప్రసాద్‌ను ఎన్నుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అవధేష్ ప్రసాద్ దళిత సమాజిక వర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ. ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై 50వేల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థే గెలుస్తారని అంతా భావించారు. అదే విధంగా జనరల్ స్థానమైన ఫైజాబాద్‌లో అవధేష్ ప్రసాద్ గెలిచి అందిరనీ ఆశ్చర్యపరిచారు.ఇక.. డిప్యూటీ స్పీకర్‌సైతం లోక్స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. స్పీకర్ అందుబాటులో లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లోక్‌సభ సమావేశాలను నడిస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఆనవాయితీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజులగ్యాప్ తర్వాత.. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానుంది. -
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
-
అమరుల త్యాగాలు వృథా కానివ్వం
∙స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి : తెలంగాణ అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రత్యేక రా ష్ట్రంకోసం ఆత్మబలి దానం చేసుకున్న మండలంలోని గొర్లవీడు గ్రామానికి చెం దిన వీణవంక శ్రీనివాసాచార్యులు, ఆజంనగర్‌కు చెందిన బీరెల్లి రాములు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.10 లక్షల చెక్కులను గురువారం అందజేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్నారని అన్నారు. అమరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండ గా నిలుస్తుందన్నారు. ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తు న్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయ ణ, ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, వైస్ ఎంపీపీ సురేందర్, జెడ్పీటీసీ సభ్యురాలు జ ర్పుల మీరాబాయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, నాయకులు ముద్దమల్ల బార్గవ్, తాటి వెంకన్న, గోవిందుల శ్యాం, మారెల్లి సేనాపతి పాల్గొన్నార