సోమరాజుకు ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డు
సోమరాజుకు ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డు
Published Sun, Sep 25 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
గొల్లపాలెం (కాజులూరు):
స్థానిక గాయత్రి ఫొటో స్టూడియో అధినేత మేరేటి సోమరాజు అంతర్జాతీయ ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. ఆ వివరాలను ఆయన ఆదివారం గ్రామంలో విలేకరులకు తెలిపారు. ప్రతీ ఏటా బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీæ(లండన్), ఫొటో సొసైటీ ఆఫ్ అమెరికా (అమెరికా), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీలా ఆర్ట్స్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)లతోపాటు ఇమేజ్ కాలేజ్ సొసైటీ ఆఫ్ అమెరికా ఉత్తమ ఫొటోగ్రాఫర్లను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తాయన్నారు. ఈ ఏడాది ఆ పోటీలకు తాను గిరిజన జీవనశైలిపై తీసిన ఛాయాచిత్రాలను పంపగా తనకు అత్యున్నత పురస్కారం లభించిందన్నారు. అమెరికాకు చెందిన ఇమేజ్ కాలేజ్ సొసైటి చైర్మన్ టోని లికిస్ తాస్ ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారన్నారు. తనను ఆ అవార్డుకు ఎంపిక చేయడమే కాకుండా సొసైటీలో జీవితకాలపు సభ్యత్వాన్ని కూడా ప్రకటించారన్నారు. తన అవార్డు పత్రాలను ఆ సంస్థలు విజయవాడలో ఉన్న ప్రతినిధులకు పంపించగా ఆంధ్రప్రదేశ్ ఫొటో అకాడమీ నిర్వహించిన ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో శనివారం అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా తాను అందుకున్నానన్నారు. సోమరాజును మండల ఫొటోగ్రాఫర్స్ సంఘ సభ్యులు అభినందించారు.
Advertisement
Advertisement